సివిల్స్‌ ప్రాథమిక పరీక్షపై ఉత్కంఠ

మే 3 తర్వాత నిర్ణయం తీసుకుంటామన్న యూపీఎస్‌సీ

సివిల్స్‌ ప్రాథమిక పరీక్ష మే 31న జరుగుతుందా? లేదా? అన్న అంశంపై మే 3వ తేదీ వరకు ఉత్కంఠ కొనసాగనుంది.
బుధవారం సమావేశమైన యూపీఎస్‌సీ బోర్డు.. మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్‌ ఉన్నందున ఆ తర్వాత పరిస్థితిని సమీక్షించి ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించాలా? లేదా? అని నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. అప్పటివరకు సందిగ్ధం తప్పదు. దేశవ్యాప్తంగా సుమారు 9 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 4.5 లక్షల నుంచి 5 లక్షల మంది పరీక్షకు హాజరవుతారు.తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 80 వేల మంది దరఖాస్తు చేశారు. లాక్‌డౌన్‌ వల్ల అభ్యర్థులు పరీక్ష సన్నద్ధతపై పూర్తి విశ్వాసంతో లేరని, మానసిక ఒత్తిడిలో ఉన్నారని సివిల్స్‌ శిక్షణ నిపుణుడు గోపాలకృష్ణ పేర్కొన్నారు.ఒక నెలపాటు వాయిదా వేయడం వల్ల వచ్చే ఏడాది పరీక్షల కాలపట్టికపై ఎటువంటి ప్రభావం పడదని అభిప్రాయపడ్డారు.ఇక అర్ధంతరంగా ఆగిపోయిన సివిల్స్‌ మౌఖిక పరీక్షలను ఎప్పటి నుంచి కొనసాగిస్తామన్నది కూడా మే 3వ తేదీ తర్వాతే నిర్ణయిస్తామని యూపీఎస్‌సీ తెలిపింది. మరో 600 మందిని ఇంటర్వ్యూ చేయాల్సి ఉంది.

Popular posts from this blog

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం

విద్యాహక్కు చట్టం-2009 (RTE - ACT)