భారీగా తగ్గిన ఎంసెట్‌ దరఖాస్తులు!

హైదరాబాద్: కరోనా ప్రభావం ప్రవేశ పరీక్షల దరఖాస్తులపైనా పడింది. తెలంగాణలో ఎంసెట్‌ రెండు విభాగాల్లో గత ఏడాది కన్నా 31,304 దరఖాస్తులు తక్కువగా రావడం గమనార్హం. నిరుడు 2,17,199 మంది విద్యార్థులు దరఖాస్తు చేయగా, ఈ ఏడాది ఇప్పటివరకు 1,85,895 మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. ఇంజనీరింగ్‌ రెండో సంవత్సరంలో ప్రవేశానికి నిర్వహించే ఈసెట్‌కు ఈ ఏడాది సుమారుగా 4వేల దరఖాస్తులు తగ్గాయి. గత ఏడాది 28,241 దరఖాస్తులు రాగా ఈ ఏడాది ఇప్పటి వరకు 24వేల దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. ఎడ్‌సెట్‌, ఐసెట్‌, పీజీఈసెట్‌, లాసెట్‌.. ఇలా అన్నింటికీ దరఖాస్తులు తగ్గినట్లు అధికారులు తెలిపారు.

Popular posts from this blog

విద్యాహక్కు చట్టం-2009 (RTE - ACT)

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం