దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం


దిల్లీ: దేశవ్యాప్తంగా 170 జిల్లాలను కరోనా వ్యాప్తికి ప్రజ్వలన కేంద్రాలు (హాట్‌స్పాట్స్‌)గా గుర్తించినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.207 జిల్లాలను నాన్‌ హాట్‌స్పాట్‌ జిల్లాలుగానూ, మిగిలినవి గ్రీన్‌జోన్‌లోనూ ఉన్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఆ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ సంయుక్త మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు
దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 1076 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయని, దీంతో దేశం మొత్తం మీద కేసుల సంఖ్య 11,439కి చేరిందని తెలిపారు. ఇప్పటి వరకు 377 మంది ప్రాణాలు కోల్పోగా.. వైరస్‌ బారిన పడిన వారిలో 11.41 శాతం మంది కోలుకున్నారని తెలిపారు.దేశవ్యాప్తంగా కొవిడ్‌-19 హాట్‌స్పాట్‌ కేంద్రాలు, నాన్‌ హాట్‌స్పాట్‌ కేంద్రాలు, గ్రీన్‌జోన్లను గుర్తించామని లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. హాట్‌స్పాట్‌ ప్రాంతాల్లో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.ఏప్రిల్‌ 20 తర్వాత హాట్‌స్పాట్‌ కాని ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో కార్యకలాపాలు మొదలవుతాయని చెప్పారు. భారత్‌లో ఇప్పటి వరకు సామాహిక సంక్రమణ వ్యాప్తి స్థాయికి కరోనా వైరస్‌ చేరలేదని, కొన్ని చోట్ల స్థానిక వ్యాప్తి మాత్రమే ఉందని లవ్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు.

Popular posts from this blog

విద్యాహక్కు చట్టం-2009 (RTE - ACT)

చరిత్రలో ఈ రోజు 21 మే 2020