'జూమ్‌'లో డిజిటల్‌ తరగతులొద్దు


  • విద్యార్థులు లైంగిక వేధింపులకు గురయ్యే ప్రమాదం..


  • ఆ యాప్‌ వాడితే యాజమాన్యాలపై కేసులు పెట్టాలి


  • ప్రభుత్వానికి జాతీయ బాలల హక్కుల కమిషన్‌ ఆదేశం

కేంద్ర హోం శాఖ ఆదేశాల మేరకు వీడియో కాన్ఫరెన్స్‌ యాప్‌ జూమ్‌లో పాఠశాల విద్యార్థులకు డిజిటల్‌ తరగతులు నిర్వహించవద్దని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.ఈ యాప్‌ విద్యార్థులకు ఏ మాత్రం సురక్షితం కాదని, వారు లైంగిక వేధింపులకు గురయ్యే ప్రమాదముందని హెచ్చరించింది.
 విద్యార్థులకు రక్షణ లేకుండా డిజిటల్‌ తరగతులు నిర్వహిస్తే జస్టిస్‌ జువనైల్‌ యాక్ట్‌-2015లోని సెక్షన్‌ 70 ప్రకారం పాఠశాలల యాజమాన్యాలపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. జూమ్‌ యాప్‌ను వినియోగించవద్దని కేంద్రం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా కొన్ని పాఠశాలల యాజమాన్యాలు ఇప్పటికీ వాడుతున్నాయని కొందరు తల్లిదండ్రులు తమకు ఫిర్యాదు చేశారని తెలిపింది. పాఠశాల విద్యార్థులకు డిజిటల్‌ తరగతుల నిర్వహణపై రాష్ర్టాల విద్యా శాఖలకు బాలల హక్కుల కమిషన్‌ కొన్ని మార్గదర్శకాలను రూపొందించి విడుదల చేసింది.పాఠశాలల్లో జూమ్‌ యాప్‌లో బోధించే డిజిటల్‌ తరగతులను పూర్తిగా నిషేధించాలి.ఇతర సాఫ్ట్‌ వేర్‌, సోషల్‌ మీడియా ఖాతాలను బోధనకు ఉపయోగిస్తే భద్రతకు సంబందించిన అన్ని చర్యలను పాఠశాల యాజమాన్యాలు తీసుకోవాలి.డిజిటల్‌ తరగతుల సమయంలో విద్యార్థులు వేధింపులకు గురైతే యాజమాన్యాలదే పూర్తి బాధ్యత.డిజిటల్‌ తరగతుల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను ఎప్పటికప్పుడు యాజమాన్యాలు అమలు చేయాలి.ఆన్‌లైన్‌ తరగతులను తల్లిదండ్రుల పర్యవేక్షణలోనే నిర్వహించాలి. విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి.విద్యార్థుల పేరుతో లాగిన్‌ ఐడీలను క్రియేట్‌ చేయొద్దు. గెస్ట్‌ ఐడీ లోనే పాఠాలను బోధించాలి.



source :  (ఆంధ్రజ్యోతి)

Popular posts from this blog

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

🌏 చరిత్రలో ఈరోజు ఏప్రిల్ 28