తెలంగాణ గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల.
తెలంగాణ గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కేంద్ర ఆర్దిక సంఘం నుంచి నిధులు రాకపోయినా రాష్ట్ర ప్రభుత్వం 12,751 గ్రామ పంచాయతీలకు రూ.308 కోట్లు విడుదల చేసింది. కేంద్ర ఆర్థిక సంఘం నిధులకు రాష్ట్ర ప్రభుత్వం వాటా కలిపి ప్రతి నెల రూ.308 కోట్లు ఇవ్వాలి. కానీ కేంద్ర ఆర్థిక సంఘం జూన్ వరకు నిధులు ఇచ్చే అవకాశం లేదు. దీంతో మొత్తం సొమ్మును రాష్ట్ర ప్రభుత్వమే విడుదల చేసింది. జనాభాతో సంబంధం లేకుండా ఒక్కో గ్రామ పంచాయతీకి రూ.3 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు ప్రభుత్వం ఇవ్వనుంది. గ్రామాల్లో కరోనా వ్యాప్తి నివారణ, పారిశుధ్య పనులు నిలిచిపోకుండా ఉండేందుకు సర్కార్ తక్షణమే ఈ నిధులను విడుదల చేసింది.