హైడ్రాక్సీక్లోరోక్విన్ కోసం భారత్‌ను అర్థిస్తున్న పాకిస్తాన్
కరోనా కష్టకాలంలోతమను భారత్ ఆదుకోవాలని పాకిస్తాన్ వేడుకొంటుంది. మీరే దిక్కంటూ ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తోంది. తమ దేశానికి కూడా హైడ్రాక్సిక్వోరోక్విన్ మందులను ఎగుమతి చేయాలని అర్థిస్తోంది. కరోనాకు మలేరియా మెడిసిన్... హైడ్రాక్సీక్లోరోక్విన్ బాగా పనిచేస్తుండటంతో భారత్ తమకు ఎగుమతి చేయాలని ప్రాధేయపడుతోంది. ఇప్పటికే అమెరికా, స్పెయిన్, బ్రెజిల్, ఇరాన్ లాంటి దేశాలు భారత్ నుంచి ఈ మెడిసిన్‌ను దిగుమతి చేసుకున్నాయి. కాగా పాకిస్తాన్‌లో కరోనా బాధితుల సంఖ్య భారీగానే పెరుగుతుంది. ఇప్పటికే 6వేలకు కరోనా బాధితుల సంఖ్య చేరుకోగా...107 మంది మరణించారు.