విద్యాహక్కు చట్టం-2009 (RTE - ACT)
RTE - ACT భారతదేశం లో : 6 నుంచి 14 ఏండ్లలోపు ఉన్న బాలలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించటానికి ఉద్దేశించిన చట్టమే Right to Free a-d Compulsory Education- Act 2009. ఈ విద్యాహక్కు చట్టం 2009 ఆగస్టు 28న రాష్ట్రపతి ఆమోదం పొందింది. కేంద్ర ప్రభుత్వం 2009 ఆగస్టు 26న ఈ బిల్లును ఆమోదించింది. జమ్ముకశ్మీర్ మినహా దేశంలోని అన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ చట్టం 2010 ఏప్రిల్ 1న అమల్లోకి వచ్చింది. ఈ చట్టంలో 7 అధ్యాయాలు, 38 సెక్షన్లు, ఒక అనుబంధ షెడ్యూల్ ఉన్నాయి . విద్యాహక్కు చట్టం ముఖ్యాంశాలు : అధ్యాయం -1 సెక్షన్-1 చట్టం పేరు: ఉచిత నిర్బంధ విద్య బాలల హక్కు చట్టం 2009 చట్టం పరిధి: జమ్ముకశ్మీర్ మినహా దేశం మొత్తం వర్తిస్తుంది. చట్టం అమలు తేదీ: 2010, ఏప్రిల్ 1 సెక్షన్-2 6 నుంచి 14 ఏండ్ల మధ్య వయసున్నవారు బాలబాలికలు ప్రాథమిక విద్య అంటే 1 నుంచి 8 తరగతి వరకు క్యాపిటేషన్ ఫీజు అంటే బడి ప్రకటించిన ఫీజు కాకుండా ఇతర రూపాల్లో చెల్లించే చందాలు స్థానిక ప్రభుత్వం అంటే నగరపాలక సంస్థ లేదా జిల్లా పరిషత్ లేదా గ్రామ...