‘పది’ జవాబుపత్రాలు జాగ్రత్త
పదో తరగతిలో రెండు సబ్జెక్టులకు సంబంధించి మూడు వార్షిక పరీక్షలు పూర్తయినందున మూల్యాంకన కేంద్రాల్లో ఉన్న వాటి జవాబుపత్రాలు దెబ్బతినకుండా జాగ్రత్తలుతీసుకోవాలని విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ డీఈవోలను ఆదేశించారు. ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు సత్యనారాయణరెడ్డితో కలిసి ఆమె బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
🔹లాక్ డౌన్ తర్వాత పదోతరగతి పరీక్షలు!
లాక్డౌన్ సడలించిన తర్వాత పదో తరగతికిసంబంధించి మిగతా నాలుగు సబ్జెక్టులపరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ వెల్లడించారు. బుధవారం డీఈవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.పాఠశాలల్లో ట్యూషన్ఫీజుపెంపుపైఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబర్లను ఏర్పాటుచేయాలని ఆదేశించారు.
🔹జూన్లో ప్రవేశ పరీక్షలు! లాక్డౌనను మే నెలాఖరు వరకు పొడిగిస్తేఎంసెట్, ఈసెట్ వంటి ప్రవేశ పరీక్షలను
జూన్మూడులేదానాలుగోవారానికివాయిదావేస్తామని ఉన్నత విద్యామండలిచైర్మన్ తుమ్మల పాపిరెడ్డి చెప్పారు. డిగ్రీలోడిటెన్షన్ విధానాన్ని రద్దుచేస్తూ వర్సిటీలకుఆదేశాలు జారీచేశామని బుధవారం మీడియాకు వెల్లడించారు. డిగ్రీ, పీజీ తదితరకోర్సులను ఆన్లైన్ లో అందించడానికి మైక్రోసాఫ్ట్ ముందుకొచ్చిందని చెప్పారు.
🔹దివ్యాంగులు, వృద్ధులకు హెల్ప్ లైన్
లాక్డౌన్ నేపథ్యంలో దివ్యాంగులు, వృద్ధులసహాయార్థం ప్రభుత్వం హెలైన్లు ఏర్పాటుచేసింది.
వృద్ధుల కోసం 14567,
దివ్యాంగులకోసం
18005728980
నంబరు ఉదయం 8 నుంచి రాత్రి 7గంటల మధ్య ఫోన్ చేయాలని అధికారులు సూచించారు.
🔹ప్రైవేటు బడుల్లో పాత ఫీజెంత?
-డీఈవోలకు విద్యాశాఖ ఉత్తర్వులు
వచ్చే విద్యా సంవత్సరం (2020-21) రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలలు ఫీజులు పెంచవద్దని ప్రభుత్వం జీవో జారీ చేసిన నేపథ్యంలో... ప్రస్తుత విద్యా సంవత్సరం (2019-20)లో వసూలు చేసిన రుసుములపై పాఠశాల విద్యాశాఖ సమాచారం సేకరిస్తోంది. సుమారు 11 వేల ప్రైవేటు పాఠశాలల వార్షిక రుసుముల వివరాలు పంపాలని విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ డీఈవోలకు ఆదేశాలు జారీ చేశారు.
పాఠశాల ఉన్న ప్రాంతం, విద్యార్థులు, సిబ్బంది సంఖ్య, భవనాలు, వార్షిక రుసుముతో పాటు ఆదాయ, వ్యయాలతో కూడిన నాలుగు పేజీల ఫార్మాట్‌ను ఐటీ శాఖతో తయారు చేయించారు. వాటిని ఆయా డీఈవోలకు పంపించనున్నారు.