🌏 చరిత్రలో ఈరోజు మే 1

సంఘటనలు

  • 1006: లూపస్ అనే రాశి లో, చైనీయులు, ఈజిప్షియనులు, సూపర్ నోవా (పేలిపోతున్న నక్షత్రం) ను గమనించారు.
  • 1544: హంగరీని టర్కీ దేశ సైన్యం ఆక్రమించింది.
  • 1682: పారిస్ వేధశాల (నక్షత్రాలను, గ్రహాలను గమనించే ప్రయోగశాల - అబ్జర్వేటరీ) ను, లూయి 15 అతని సభలోని సభ్యులు ప్రారంభించారు.
  • 1704: మొట్టమొదటి 'వ్యాపార ప్రకటన' బోస్టన్ న్యూస్ లెటర్ లో ప్రచురితమైంది.
  • 1707: ఇంగ్లాండ్, వేల్స్, స్కాట్లాండ్ కలిసి పోయి 'యునైటెడ్ కింగ్ డం ఆఫ్ గ్రేట్ బ్రిటన్' గా ఏర్పడింది.
  • 1751: మొట్టమొదటి అమెరికన్ క్రికెట్ పోటీ జరిగింది.
  • 1898: డేవీ డే (మనీలా బే యుద్ధం) (అమెరికాలో)
  • 1906: మే డే కోసం జరుపుతున్న ఆందోళనలో, పారిస్ దళలు చాలామందిని నిర్బంధించాయి (ఆరెస్టు).
  • 1925: సైప్రస్ దీవి బ్రిటిష్ వలసగా మారిన రోజు.
  • 1931: న్యూయార్క్ లోని ఎంపైర్ బిల్డింగ్ పూర్తి అయిన రోజు.
  • 1954: రెండవ ఆసియా క్రీడలు మనీలాలో ప్రారంభమయ్యాయి.
  • 1960: గారీ పవర్స్, అమెరికాకు చెందిన గూధచారి విమానం యు2 లో ప్రయాణిస్తున్నసమయంలో యు.ఎస్.ఎస్.ఆర్ (పాత రష్యన్ దేశం), ఆ విమానాన్ని కూల్చి, అతనిని బందీగా పట్టుకుంది.
  • 1960: డెన్మార్క్ లో, లీగో లేండ్ ప్రారంభమయింది.
  • 1960: గుజరాత్, మహారాష్ట్ర ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి.
  • 1963: సీనియర్ సిటిజన్స్ డే (వృద్ధుల దినోత్సవం) (మసాఛుసెట్స్)
  • 1967: ఉత్తర ప్రదేశ్ గవర్నర్‌గా బెజవాడ గోపాలరెడ్డి పదవీబాధ్యతలు చేపట్టాడు.
  • 1988: జనరల్ వి.ఎస్. శర్మ భారత దేశమునకు సైనిక ప్రధానాధికారిగా నియామకం.



జననాలు

  • 1769: డ్యూక్ ఆఫ్ వెల్లింగ్టన్ ఆర్ధర్ వెల్లెస్లీ
  • 1867: కాశీనాథుని నాగేశ్వరరావు, పాత్రికేయుడు, వ్యాపారవేత్త, స్వాతంత్ర్య సమర యోధుడు, రాజకీయ నాయకుడు. (మ.1938)
  • 1901: పి.వి.రాజమన్నార్, న్యాయవాది, పండితుడు, భారత రాజకీయనాయకుడు. (మ.1979)
  • 1913: పుచ్చలపల్లి సుందరయ్య, కమ్యూనిస్టు నాయకుడు, తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట వీరుడు, స్వాతంత్ర్య సమర యోధుడు.
  • 1916: గ్లెన్ ఫోర్డ్, అమెరికన్ సినిమా నటుడు.
  • 1919: మన్నా డే, నేపథ్య గాయకుడు.
  • 1924: పూసపాటి విజయరామ గజపతి రాజు, పూర్వ సంస్థానాధీశులలో ఒకరు, పార్లమెంటు సభ్యుడు, 100 దేవాలయాలకు వంశపారంపరిక ధర్మకర్తలు.
  • 1925: నార్ల చిరంజీవి, కవి, కథకుడు, నాటక కర్త, బాల సాహిత్యకారుడు, సినీ గీత రచయిత.
  • 1943: కొలకలూరి స్వరూపరాణి, తెలుగు రచయిత్రి, కవయిత్రీతిలక అనే బిరుదును వరల్డ్ ఎవాంజిలిన్ సంస్థ ప్రదానం చేసింది.
  • 1943: ఐ.వి.యస్. అచ్యుతవల్లి, 8 కథాసంకలనాలు, ఎన్నో నవలలు, కథలు వ్రాసి రచయిత్రి.
  • 1944: సురేష్ కల్మాడీ, భారత రాజకీయవేత్త.
  • 1944: మందులు.కె రంగస్థల నటుడు, దర్శకుడు. (మ.2002)
  • 1946: కె.సి.శేఖర్‌బాబు తెలుగు సినిమా నిర్మాత. (మ.2017)
  • 1949: ఐ.వి.యస్. అచ్యుతవల్లి, 18 నవలలు, 400లకుపైగా కథలు వ్రాసి రచయిత్రిగా వాసికెక్కింది.
  • 1952: టి.జీవన్ రెడ్డి, 2007-09 కాలంలో రాష్ట్ర మంత్రివర్గంలో రోడ్డు-భవనాల శాఖ మంత్రి.
  • 1955: రాధేయ, తెలుగు కవిత్వంలో ప్రతిష్ఠాత్మకమైన ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డు ప్రదాత.
  • 1958: సోమేపల్లి వెంకట సుబ్బయ్య, రచయిత.
  • 1965: దొడ్ల నారపరెడ్డి, ఆయుర్వేద వైద్యులు, రచయిత.
  • 1971: అజిత్ కుమార్, భారత దేశ సినీ నటుడు.
  • 1981: సుమన్ శెట్టి, తెలుగు హాస్య నటుడు.



మరణాలు

  • 1945: హిట్లర్ మరణించినట్లు జర్మనీ ప్రకటించింది
  • 2008: నిర్మలా దేశ్‌పాండే, గాంధేయవాది, రాజ్యసభ సభ్యురాలు. (జ.1929)
  • 2019: బి. సుభాషణ్ రెడ్డి కేరళ, మద్రాసు హైకోర్టుల ప్రధాన ఛీఫ్ జస్టీస్ (జ.1943)



జాతీయ / అంతర్జాతీయ దినోత్సవాలు

  • మే దినోత్సవం - లేబర్ డేగా 66 దేశాలలో జరుపుకుంటారు.
  • వప్పు డే (ఫిన్లాండ్)
  • లీ డే (హవాయి లో)
  • పిల్లల ఆరోగ్య దినం (అమెరికాలో)
  • యూనస్ ఎమ్రే స్మృతి దినం (టర్కీలో)
  • మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల అవతరణ దినోత్సవం.

Popular posts from this blog

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

🌏 చరిత్రలో ఈరోజు ఏప్రిల్ 28