తెలంగాణలో కరోనా: రెడ్ జోన్‌లోకి ఆరు జిల్లాలు
తెలంగాణలో కరోనా వ్యాప్తిని బట్టి రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్ల జాబితాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,038 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి 28 మంది మృతి చెందారు. రెడ్ జోన్ జిల్లాలు : హైదరాబాద్, సూర్యాపేట, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, వరంగల్ అర్బన్ ఆరెంజ్ జోన్ జిల్లాలు : నిజామాబాద్, గద్వాల, నిర్మల్, నల్గొండ, ఆదిలాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, కుమ్రం భీం, ఆసిఫాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్, భూపాలపల్లి, మెదక్, జనగామ, నారాయణ పేట, మంచిర్యాల గ్రీన్ జోన్ జిల్లాలు : పెద్దపల్లి, నాగర్ కర్నూల్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సిద్దిపేట, వరంగల్ రూరల్, వనపర్తి, యాదాద్రి