తెలంగాణలో పదో తరగతి పరీక్షలు వాయిదా
పదో తరగతి పరీక్షలను వాయిదా వేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి పరీక్షలపై విచారణ జరిపిన హైకోర్టు జీహెచ్‌ఎంసీ, రంగారెడ్డి జిల్లాలు మినహా మిగిలిన ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించుకోవచ్చంటూ తీర్పును ఇచ్చింది. అయితే ఇది సాధ్యం కాదని భావించిన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా తీవ్రత తగ్గిన తరువాతే పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీంతో ఈ నెల 8 నుంచి జరగాల్సిన పదో తరగతి పరీక్షలు మరోసారి వాయిదా పడ్డాయి.