యూజీ పరీక్షలు వాయిదా..
జూలై 12న అంబేద్కర్ వర్సిటీ అర్హత పరీక్ష...
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ అర్హత పరీక్ష-2020ని తెలుగు రాష్ట్రాల్లో జూలై 12న నిర్వహించనున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 25వ తేదీలోపు ఆన్‌లైన్‌లో రిజిస్ర్టేషన్ చేసుకోవచ్చు.
యూజీ పరీక్షలు వాయిదా..
అంబేద్కర్ వర్సిటీలో వివిధ యూజీ పరీక్షలు వాయిదాపడ్డాయి. బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) మొదటి సెమిస్టర్, బీఈడీ (బ్యాక్‌లాగ్), ఎంబీఏ (హాస్పిటల్ అండ్ హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్) పరీక్షలు; బీఏ, బీకాం, బీఎస్సీ వార్షిక పరీక్షలు; డిగ్రీ మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ (సీబీఎస్) పరీక్షలను వాయిదా వేశారు. వీటిని తిరిగి జూలైలో నిర్వహించే అవకాశాలున్నాయి. డిగ్రీ ఓల్డ్ బ్యాచ్ విద్యార్థులు ఈ నెల 20వ తేదీలోపు పూర్తి వివరాలతో రిజిస్ర్టేషన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.