విద్యాహక్కు చట్టం-2009 (RTE - ACT)
RTE - ACT
భారతదేశం లో : 6 నుంచి 14 ఏండ్లలోపు ఉన్న బాలలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించటానికి ఉద్దేశించిన చట్టమే Right to Free a-d Compulsory Education- Act 2009.
- ఈ విద్యాహక్కు చట్టం 2009 ఆగస్టు 28న రాష్ట్రపతి ఆమోదం పొందింది.
- కేంద్ర ప్రభుత్వం 2009 ఆగస్టు 26న ఈ బిల్లును ఆమోదించింది.
- జమ్ముకశ్మీర్ మినహా దేశంలోని అన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ చట్టం 2010 ఏప్రిల్ 1న అమల్లోకి వచ్చింది.
- ఈ చట్టంలో 7 అధ్యాయాలు, 38 సెక్షన్లు, ఒక అనుబంధ షెడ్యూల్ ఉన్నాయి.
విద్యాహక్కు చట్టం ముఖ్యాంశాలు :
అధ్యాయం -1
సెక్షన్-1
- చట్టం పేరు: ఉచిత నిర్బంధ విద్య బాలల హక్కు చట్టం 2009
- చట్టం పరిధి: జమ్ముకశ్మీర్ మినహా దేశం మొత్తం వర్తిస్తుంది.
- చట్టం అమలు తేదీ: 2010, ఏప్రిల్ 1
సెక్షన్-2
- 6 నుంచి 14 ఏండ్ల మధ్య వయసున్నవారు బాలబాలికలు
- ప్రాథమిక విద్య అంటే 1 నుంచి 8 తరగతి వరకు
- క్యాపిటేషన్ ఫీజు అంటే బడి ప్రకటించిన ఫీజు కాకుండా ఇతర రూపాల్లో చెల్లించే చందాలు
- స్థానిక ప్రభుత్వం అంటే నగరపాలక సంస్థ లేదా జిల్లా పరిషత్ లేదా గ్రామ పంచాయతీ
అధ్యాయం-2
సెక్షన్-3
- 6 నుంచి 14 ఏండ్లలోపు బాలలందరికీ ఉచిత ప్రాథమిక విద్య పొందే హక్కు ఉంటుంది.
- బాలలు ప్రాథమిక విద్య పూర్తిచేయడానికి ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవరసరం లేదు.
సెక్షన్-4
- 6 నుంచి 14 ఏండ్లలోపు వయసున్న పిల్లలు మధ్యలోనే బడి మానివేస్తే వారిని తిరిగి వారి వయసుకు తగిన తరగతిలో చేర్చుకోవాలి.
- వయసుకు తగిన తరగతిలో చేరిన బాలలు తోటి విద్యార్థులతో సమానంగా ఆ తరగతి వరకు కావాల్సిన సామర్థ్యాలను పొందటానికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి.
- ఈ విధంగా ప్రాథమిక విద్యలో ప్రవేశించిన బాలలు 14 ఏండ్లు నిండినప్పటికీ ఎలిమెంటరీ విద్యను పూర్తిచేసేవరకు ఉచిత విద్యను పొందే హక్కు ఉంది.
- ఆ విద్యార్థులకు శిక్షణ కాలవ్యవధి కనీసం మూడు నెలలు, గరిష్టంగా రెండేండ్లవరకు ఉండవచ్చు.
సెక్షన్-5
- బడిలో ప్రాథమిక విద్య పూర్తిచేసే సదుపాయం లేకపోతే ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏ ఇతర బడికైనా బదిలీ కోరే హక్కు బాలలకు ఉంటుంది.
అధ్యాయం-3
సెక్షన్-6
- ఆర్టీఈ అంశాలు అమలు చేయటానికి పరిసర ప్రాంత పరిధిలో బడి లేకపోతే చట్టం అమల్లోకి వచ్చిన మూడేండ్లలోపు ప్రభుత్వం లేదా స్థానిక సంస్థ బడిని నెలకొల్పాలి.
- 1 నుంచి 5 తరగతుల వరకు కిలోమీటర్ దూరంలోపు పాఠశాలను ఏర్పాటు చేయాలి. 6 నుంచి 8 తరగతుల బాలలకు 3 కి.మీ.లోపు పాఠశాలను ఏర్పాటుచేయాలి.
- తీవ్రమైన వైకల్యంతో బాధపడే బాలలకు రవాణా సౌకర్యా లు ఏర్పాటుచేయాలి. లేకపోతే ఇంటివద్దే విద్యనందించాలి.
సెక్షన్-7
- చట్టాన్ని అమలుచేసేందుకు నిధులను సమకూర్చే బాధ్యత రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు సమానంగా ఉంటుంది.
- రెగ్యులర్ పాఠశాలల్లో బోధించే టీచర్లందరికీ ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు బోధించేందుకు తగిన శిక్షణ ఇవ్వాలి.
సెక్షన్-8
- ప్రభుత్వ నియంత్రణలో లేని బడిలో పిల్లలను చేర్పించి, ప్రాథమిక విద్యకు పెట్టిన ఖర్చును తిరిగి చెల్లించాలని అడిగే హక్కు విద్యార్థి తల్లిదండ్రులకు ఉండదు.
సెక్షన్-9
- తమ ఆవాస ప్రాంతాల్లో పుట్టినప్పటి నుంచి 14 ఏండ్లు వచ్చేవరకు పిల్లలందరి రికార్డులను స్థానిక ప్రభుత్వం ఇంటింటి సర్వే ద్వారా నిర్వహించాలి.
సెక్షన్-10
- 6 నుంచి 14 ఏండ్లలోపు పిలల్లను పరిసర పాఠశాలలో చేర్పించటం ప్రతి తల్లిదండ్రి లేదా సంరక్షకుడి బాధ్యత.
సెక్షన్-11
- ఆరేండ్లు నిండే వరకు ప్రాథమిక విద్యకు బాలలను సంసిద్ధులను చేయటానికి పూర్వ ప్రాథమిక విద్యలో చేర్పించడం ప్రతి తల్లిదండ్రి లేదా సంరక్షకుడి బాధ్యత.
అధ్యాయం-4
సెక్షన్-12
- బడులు ప్రభుత్వ గ్రాంట్లు ఎంతశాతం పొందుతున్నాయో బడిలో చేరిన పిల్లల్లో అంతశాతం మందికి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి. కనీసం 25 శాతానికి తగ్గకుండా పిల్లలను బడిలో చేర్చుకోవాలి.
- కేంద్రీయ, నవోదయ, సైనిక పాఠశాలలు విద్యార్థుల సంఖ్యలో 25శాతం సీట్లు బలహీనవర్గాలకు, ప్రతికూల పరిస్థితులు ఉన్న పిల్లలకు కేటాయించాలి.
సెక్షన్-13
- బాలబాలికలను బడిలో చేర్చుకోవటానికి క్యాపిటేషన్ ఫీజు వసూలు చేయరాదు. బడిలో చేర్చుకొనేందుకు ఎలాంటి ఎంపిక పరీక్ష నిర్వహించరాదు. అనుమతి లేకుండా పరీక్ష నిర్వహిస్తే జరిమానా విధిస్తారు.
సెక్షన్-14
- వయసు ధ్రువీకరణ పత్రం లేదన్న కారణంతో బడిలో ప్రవేశాన్ని తిరస్కరించరాదు.
సెక్షన్-15
- విద్యాసంవత్సరంలో బడిలో ప్రవేశానికి సాధారణంగా జూన్ 12 నుంచి ఆగస్టు 31వరకు గడువు ఉంటుంది. గడువు తర్వాత ప్రవేశం కోరినా తిరస్కరించకూడదు.
సెక్షన్-16
- బడిలో ప్రవేశం పొందిన బాలలను ప్రాథమిక విద్య పూర్తయ్యేవరకు బడి నుంచి తొలగించకూడదు.
సెక్షన్-17
- బాలలను శారీరకంగా గానీ, మానసికంగా గానీ వేధించరాదు. అలాంటి చర్యలకు పాల్పడిన ఉపాధ్యాయులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి.
సెక్షన్-18
- ప్రభుత్వ గుర్తింపు లేకుండా పాఠశాలలను స్థాపించకూడదు. ఈ నియమాన్ని ఉల్లంఘించినవారు శిక్షార్హులు.
సెక్షన్-19
- షెడ్యూల్‌లోని నియమాలను పాటించని పాఠశాలలకు గుర్తింపు ఇవ్వకూడదు. ఈ చట్టం అమలుకు ముందే స్థాపించిన పాఠశాలలు చట్టం అమల్లోకి వచ్చిన నాటి నుంచి మూడేండ్లలోపు తమ సొంత ఖర్చులతో షెడ్యూల్‌లోని నియమనిబంధనల మేరకు సౌకర్యాలు ఏర్పాటుచేయాలి.
సెక్షన్-20
- షెడ్యూల్‌లోని నియమాలు, ప్రామాణికాలు తొలగించటం, కొత్తగా చేర్చటం లేదా సవరణ చేయటం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది.
సెక్షన్-21
- అన్ ఎయిడెడ్ పాఠశాలలు తప్ప ప్రతి పాఠశాలలోనూ స్థానిక ప్రజాప్రతినిధులు, బడిలోని విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో బడి యాజమాన్య సంఘాన్ని ఏర్పాటుచేయాలి. కమిటీ మొత్తం సభ్యుల్లో 50 శాతం మహిళలు ఉండాలి. ఈ కమిటీకి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కన్వీనర్‌గా ఉండాలి.
సెక్షన్-22
- పాఠశాల యాజమాన్య కమిటీ ఏటా నవంబర్‌లో పాఠశాల అభివృద్ధి ప్రణాళికలను రూపొందించాలి.
సెక్షన్-23
- ఉపాధ్యాయుల నియామకంలో అవసరమైన అర్హతలు, ఉద్యోగ షరతులు, నిబంధనలు కచ్చితంగా పాటించాలి.
సెక్షన్-24
- ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలి. నిర్ధారిత సమయంలో పాఠ్యాంశాలు పూర్తిచేయాలి.
సెక్షన్-25
- షెడ్యూల్‌లో నిర్ధారించిన విధంగా విద్యార్థులు-ఉపాధ్యాయుల నిష్పత్తి ప్రతి పాఠశాలలో తప్పనిసరిగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
సెక్షన్-26
- ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయాలి. మొత్తం ఉపాధ్యా య పోస్టుల్లో ఖాళీలు పదిశాతానికి మించకుండా చూడాలి.
సెక్షన్-27
- జనాభా గణన, ఎన్నికల విధులకు తప్ప ఉపాధ్యాయులను ఏ విద్యేతర పనులకు వినియోగించరాదు.
సెక్షన్-28
- ఏ ఉపాధ్యాయుడు కూడా ప్రైవేటు ట్యూషన్స్, ప్రైవేటు బోధన పనులు చేయరాదు.
అధ్యాయం-5
సెక్షన్-29
- బాలల జ్ఞానం, సామర్థ్యం, నైపుణ్యాలు పెంపొందించి వారి సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడే పాఠ్యప్రణాళిక, మూల్యాంకన విధానాన్ని నిర్ధారించి పూర్తిచేయాలి.
సెక్షన్-30
- ఎలిమెంటరీ విద్య పూర్తయ్యేవరకు బాలలు ఎలాంటి బోర్డు పరీక్షలు రాయాల్సిన అవసరం లేదు.
అధ్యాయం-6
సెక్షన్-31
- విద్యపై బాలలకు ఉన్న హక్కులను పరిశీలించి, కాపాడే ఏర్పాట్లను సమీక్షించి సమర్థవంతంగా అమలయ్యేందుకు తగిన సూచనలు చేసి బాలల హక్కులను పర్యవేక్షించాలి.
సెక్షన్-32
- విద్యాహక్కు చట్టం ఉల్లంఘనకు గురైన పక్షంలో ఎవరైనా స్థానిక ప్రభుత్వానికి ఫిర్యాదు చేయవచ్చు.
సెక్షన్-33, 34
- బాలల హక్కుల రక్షణకు జాతీయ, రాష్ట్ర సలహా సంఘాలను ఏర్పాటుచేయాలి.
అధ్యాయం-7
సెక్షన్-35
- చట్టం అమలు కోసం సంబంధిత ప్రభుత్వాలకు మార్గదర్శక సూత్రాలు, ఆదేశాలను కేంద్ర ప్రభుత్వం జారీచేస్తుంది.
సెక్షన్-36
- శిక్షార్హమైన నేరాలకు సంబంధిత ప్రభుత్వ ప్రకటన ద్వారా అధీకృతం చేసిన అధికారి ఆమోదం పొందిన తర్వాతే ప్రాసిక్యూషన్ చేపట్టాలి.
సెక్షన్-37
- సదుద్దేశంతో చేపట్టిన చర్యలకు రక్షణ కల్పించాలి.
సెక్షన్-38
- చట్ట నియమాలు రూపొందించటానికి సంబంధిత ప్రభుత్వానికి అధికారం ఉంటుంది.
షెడ్యూల్ బడి నియమాలు, ప్రామాణికాలు
1 నుంచి 5వ తరగతి వరకు
- 60 మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు
- 61 నుంచి 90 మంది బాలల వరకు ముగ్గురు
ఉపాధ్యాయులు
- 91 నుంచి 120 మంది విద్యార్థుల వరకు నలుగురు
- 121 నుంచి 200 వరకు ఐదుగురు ఉపాధ్యాయులు
- 150 మించి విద్యార్థులు ఉంటే ఐదుగురు
ఉపాధ్యాయులు, ఒక ప్రధానోపాధ్యాయుడు
- 200 మించి విద్యార్థులు ఉంటే ప్రధానోపాధ్యాయుడు కాకుండా ప్రతి 40 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండాలి
- 1 నుంచి 5వ తరగతి వరకు విద్యా సంవత్సరంలో 200 పనిదినాలు, 800 బోధనా గంటలు ఉండాలి.
6 నుంచి 8వ తరగతి వరకు
- ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. కింది అంశాలకు కనీసం ఒక ఉపాధ్యాయుడు ఉండాలి.
1. విజ్జానశాస్త్రం, లెక్కలు, 2. సామాజిక శాస్త్రం 3.భాషలు
- ప్రతి 35 మంది విద్యార్థులకు కనీసం ఒక ఉపాధాయ్యు డు ఉండాలి.
- బడిలో చేర్చుకున్న విద్యార్థుల సంఖ్య 100కు మించితే పూర్తికాల ప్రధానోపాధ్యాయుడితోపాటు
3. వృత్తి విద్యలకు పార్ట్‌టైం బోధకులు ఉండాలి
- 6-8 తరగతులకు 220 పనిదినాలు, 1000 బోధనా గంటలు ఉండాలి.
- ప్రతి టీచర్‌కు ఒక తరగతి గది ఉండాలి
- వారానికి కనీసం బోధన 45 గంటలు ఉండాలి.