గురుకుల కళాశాలల్లో ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగింపు


తెలంగాణలోని గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్‌లో చేరాలనుకునే టెన్త్ విద్యార్థులకు శుభవార్త. కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ గడువును పెంచింది తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ-టిఆర్ఇఐఎస్. తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ జూనియస్ కాలేజెస్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్-టిఎస్ఆర్జేసీ సెట్ 2020 పేరుతో ఈ పరీక్ష జరగనుంది. వాస్తవానికి ఈ ఎగ్జామ్ మే 10న జరగాల్సి ఉండగా కరోనా వైరస్ సంక్షోభం కారణంగా వాయిదా పడింది. పరీక్ష వాయిదా వేయడంతో దరఖాస్తు చేయాలనుకునే విద్యార్థులకు మరో అవకాశం ఇస్తోంది సొసైటీ. ఆసక్తి గల విద్యార్థులు జూలై 10 వరకు అప్లై చేయొచ్చు. ఆ తర్వాత ఎంట్రెన్స్ టెస్ట్ తేదీని ప్రకటించనుంది. తెలంగాణలోని 35 రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ ఫస్ట్ ఇయర్‌లో ప్రవేశాల కోసం టిఎస్ఆర్జేసీ సెట్ 2020 జరగనుంది. వీటిలో 20 బాలికల కళాశాలలు కాగా, 15 బాయ్స్ కాలేజీలు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను https://tsrjdc.cgg.gov.in వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఏవైనా సందేహాలు ఉంటే 040-24734899 లేదా 9490967222 నెంబర్లను సంప్రదించొచ్చు.



దరఖాస్తు గడువు పొడిగింపు.

తెలంగాణలోని మ‌హాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తుల సంక్షేమ గురుకుల విద్యాల‌యాల సంస్థ వివిధ జూనియ‌ర్ క‌ళాశాల‌లు, డిగ్రీ క‌ళాశాల‌ల్లో ప్రవేశానికి దరఖాస్తు గడువును జులై 12 వరకు పొడిగించినట్లు సొసైటీ కార్యదర్శి మల్లయ్య బట్టు తెలిపారు. సంబంధిత కళాశాలల్లో ప్రవేశానికి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ విద్యార్థినీ, విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు.

Popular posts from this blog

విద్యాహక్కు చట్టం-2009 (RTE - ACT)

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం