ఆధార్‌తో ఎస్‌బీఐ ఆన్‌లైన్‌ సేవింగ్స్‌ అకౌంట్‌


 ఆధార్‌ నంబర్‌తో ఇన్‌స్టంట్‌గా డిజిటల్‌ సేవింగ్స్‌ అకౌంట్‌ను తెరిచే సౌలభ్యాన్ని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) పునః ప్రారంభించింది. ఇందుకోసం యోనో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అందులో పాన్‌, ఆధార్‌ వివరాలతో పాటు ఓటీపీని నమోదు చేయాల్సి ఉంటుంది. అనంతరం ఇతర వివరాలు ఇవ్వాలి. నామినేషన్‌ సదుపాయం కూడా ఉంది.

ఆన్‌లైన్‌లో ఖాతా తెరిచిన వారికి రూపే ఏటీఎం, డెబిట్‌ కార్డును జారీ చేస్తారు. కాగితం అవసరం లేకుండానే ఇన్‌స్టా సేవింగ్స్‌ బ్యాంక్‌ ఖాతాను  పాన్‌, ఆధార్‌ వివరాలతో తెరవొచ్చని ఎస్‌బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. ఇదంతా బ్యాంక్‌ శాఖను సందర్శించకుండానే సాధ్యమౌతుందని ఎస్‌బీఐ ఛైర్మన్‌ రజనీశ్‌ కుమార్‌ పేర్కొన్నారు. పూర్తి కేవైసీ అప్‌డేట్‌ చేసేందుకు ఏడాదిలో ఎప్పుడైనా సమీప బ్రాంచ్‌ను సంప్రదించొచ్చని ఎస్‌బీఐ తెలిపింది.

Popular posts from this blog

విద్యాహక్కు చట్టం-2009 (RTE - ACT)

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం