యూపీఎస్సీ పరీక్షల కొత్త షెడ్యూల్‌


యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌-2020 ప్రిలిమినరీ పరీక్ష అక్టోబర్‌ 4న జరగనుంది. దేశంలో కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ నేపథ్యంలో మే 31న జరగాల్సిన ప్రిలిమ్స్‌ పరీక్ష వాయిదాపడింది. ఈ నేపథ్యంలో సివిల్స్‌తో సహా వివిధ పరీక్షల సవరించిన తేదీలను యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వెల్లడించింది. కొత్త తేదీలను కమిషన్‌ అధికారిక వెబ్‌సైట్‌ upsc.gov.in లో ఉంచింది. యూపీఎస్సీ సీసీఎస్సీ ప్రధాన పరీక్ష వచ్చే ఏడాది జనవరి 8న జరగనుంది. అదేవిధంగా సివిల్‌ సర్వీసెస్‌ (మెయిన్‌)-2019 పరీక్షకు సంబంధించిన ఫిజికల్‌ టెస్ట్‌లు జూన్‌ 20 నుంచి జరగనున్నాయి. 
ప్రధానమైన పరీక్షలు 
  • ఎన్‌డీఏ అండ్‌ ఎన్‌ఏ పరీక్ష (1)- సెప్టెంబర్‌ 6న
  • కంబైండ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ ఎగ్జామ్‌- అక్టోబర్‌ 22న
  • సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ ఎగ్జామినేషన్‌- డిసెంబర్‌ 20న
  • ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ (మెయిన్‌) ఎగ్జామ్‌- 2021, ఫిబ్రవరి 28న
  • ఐఈఎస్‌ లేదా ఐఎస్‌ఎస్‌ ఎగ్జామినేషన్‌- అక్టోబర్‌ 16న
  • ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ మెయిన్‌ ఎగ్జామ్‌- ఆగస్టు 9న
  • కంబైండ్‌ జీయో సైంటిస్ట్‌ (మెయిన్‌) ఎగ్జామ్‌- ఆగస్టు 8న జరగనున్నాయి.

యూపీఎస్సీ క్యాలెండర్‌-2020

Popular posts from this blog

చరిత్రలో ఈ రోజు 13 జూన్ 2020

10వ తరగతి పరీక్షలపై కొనసాగుతున్న సస్పెన్స్

విద్యాహక్కు చట్టం-2009 (RTE - ACT)