చరిత్ర లో ఈరోజు జూన్- 3.


సంఘటనలు

1916: జాతీయ రక్షణ చట్టం నేషనల్ డిఫెన్స్ యాక్ట్ జూన్ 3న ఆమోదించబడింది జనవరి 1న సవరణ 

1947: బ్రిటీషు వైస్రాయి మౌంట్‌బాటన్ స్వాతంత్ర్యానంతరం భారతదేశంలోని స్వదేశసంస్థానాలకు సార్వభౌమత్వం తొలగించబడుతుందని ప్రకటించాడు.

1962: ఫ్రాన్స్ లోని ఓర్లీ విమానాశ్రయం లో బోయింగ్ 707 విమానం దుర్ఘటన.

1984 : అమృత్‌సర్ లో గల సిక్కుల దేవాలయం స్వర్ణదేవాలయంలో ఆపరేషన్ బ్లూస్టార్ మొదలైనది. ఇది జూన్ 6 వరకు జరిగింది.

జననాలు

1726: జేమ్స్ హట్టన్ స్కాటిష్ తత్వవేత్త, ప్రకృతి ప్రియుడు (మ.1797)

1911: గుమ్మలూరి సత్యనారాయణ, డెల్టా శిల్పి-ఆర్థర్ కాటన్ అనే ఉద్గ్రంథం వ్రాశారు. రామాయణ హితోపదేశం పేర రామాయణ రహస్యాలను వెలువరించారు.

1924: కరుణానిధి, భారత దేశ రాజకీయవేత్త, తమిళనాడు 15 వ ముఖ్యమంత్రి.

1929: చిమన్‌భాయి పటేల్, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి (మ.1994).

1930: జార్జి ఫెర్నాండెజ్, భారత రాజకీయవేత్త.

1952: బండి నారాయణస్వామి, కథారచయిత, నవలాకారుడు. 'స్వామి' పేరుతో పేరొందాడు.

1965: సురీందర్ ఖన్నా, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.

1966: రాధ, భారతీయ సినీనటి.

1972: టి. హరీశ్ రావు, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు.

మరణాలు

1657: విలియం హార్వే, రక్త ప్రసరణ సిద్ధాంతాన్ని వివరించిన ఆంగ్ల వైద్యుడు. (జ.1578,April 1).

1979: సంగం లక్ష్మీబాయి, స్వాతంత్ర్య సమరయోధురాలు, భారత లోక్ సభ సభ్యురాలు. (జ.1911)

1989 : ఇరానీ మతనాయకుడు మరియు పండితుడు ఆయతొల్లాహ్ ఖొమైనీ మరణం (జ.1902).

2004: గరిమెళ్ళ రామమూర్తి, నటులు, నాటకసంస్థ నిర్వాహకులు. (జ.1936)

2007: రత్నమాల (నటి), నటన సినీ ప్రపంచములో పలువురి మన్ననలను అందుకొన్నది.

2011: కరుటూరి సూర్యారావు, కష్టే ఫలీ అనే నానుడి నిజము చేసిన గొప్ప వ్యవసాయ, వ్యాపార, పారిశ్రామిక వేత్త. (జ.1933)

2016: ముహమ్మద్ ఆలీ, విశ్వవిఖ్యాత బాక్సింగ్ ఛాంపియన్ (జ.1942)

2019: బి.కె.బిర్లా బిర్లా కుటుంబానికి చెందిన భారతీయ వ్యాపారవేత్త. (జ.1921)

పండుగలు , జాతీయ దినదినోత్సవాలు.

 ప్రపంచ సైకిల్ దినోత్సవం. 

2018 ఏప్రిల్‌లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం ప్రతి సంవత్సరం జూన్ 3 ను ప్రపంచ సైకిల్ దినోత్స‌వంగా ప్రకటించింది. ప్రపంచ సైకిల్ దినోత్సవం కోసం లెస్జెక్ సిబిల్స్కి అనే సామాజికవేత్త‌ప్రచారం, తుర్క్మెనిస్తాన్ మ‌రియు 56 ఇతర దేశాల మద్దతు ఫలితంగా జూన్ 03న ప్ర‌పంచ సైకిల్ దినోత్స‌వం ఏర్ప‌డింది.

Popular posts from this blog

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

🌏 చరిత్రలో ఈరోజు ఏప్రిల్ 28