GK
1)దేశవ్యాప్తంగా BS-VI ఇంధన సరఫరాను ప్రారంభించిన దేశంలో మొదటి సంస్థ?
జ: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్.
2) కరోనా వైరస్‌ను నివారించడానికి ప్రజలు అనుసరించాల్సిన ఐదు విషయాలను తెలిపే ‘Do the Five. Help stop Coronavirus’ అనే ప్రచారాన్ని ప్రారంభించింది?
జ: గూగుల్.
3) దేశంలో మొదటిసారిగా ఏ రాష్ట్ర పోలీసులు టేజర్ తుపాకులను ప్రవేశపెట్టారు?
జ: గుజరాత్.
4) మహిళల సాధికారత కోసం ప్రభుత్వం 20,466.94 కోట్ల రూపాయలు (మార్చి 10, 2020 వరకు) ఏ పథకం కింద మంజూరు చేసింది?
జ: స్టాండ్ అప్ ఇండియా.
5) ‘Messiah Modi: A tale of Great expectations’ పుస్తకాన్ని ఎవరు రచించారు?
జ: తవ్లీన్ సింగ్.
6) రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతిలో రిజర్వేషన్లను ఏ రాష్ట్రం రద్దు చేసింది?
జ: ఉత్తరాఖండ్.
7) COVID-19 మహమ్మారి గురించి పౌరులలో అవగాహన కల్పించడానికి ప్రభుత్వం 'MyGov Corona Helpdesk' ను ఏ సోషల్ నెట్వర్క్ ప్లాట్‌ఫామ్‌లో ప్రారంభించింది?
జ: వాట్సాప్.
8) పోలీస్ స్టేషన్ విజిటర్ సర్వే సిస్టమ్, ఇ-నైట్ బీట్ చెకింగ్ సిస్టమ్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది?
జ: హిమాచల్ ప్రదేశ్.
9) మిషన్ స్వావలంబన్ కింద వర్ధమాన పారిశ్రామికవేత్తలను శక్తివంతం చేయడానికి ప్రత్యేక రైలు 'స్వవలంబన్ ఎక్స్‌ప్రెస్'ను ఏ ఆర్థిక సంస్థ ప్రారంభించనుంది?
జ: స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సిడ్బి)
10) ప్రమాదాల సమయంలో వేగంగా రక్త నష్టం జరగకుండా ఉండటానికి స్టార్చ్ ఆధారిత 'హెమోస్టాట్' పదార్థాన్ని ఏ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు?
జ: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నానో సైన్స్ అండ్ టెక్నాలజీ