బీటెక్‌, ఫార్మా, ఎంబీఏ, ఎంసీఏ పరీక్షల ప్రతిపాదిత షెడ్యూల్‌ ఇదే..!


జేఎన్‌టీయూ హైదరాబాద్‌ ఈ నెల 20 నుంచి బీటెక్‌, ఫార్మా, ఎంబీఏ, ఎంసీఏ పరీక్షల నిర్వహణకు సిద్ధమవుతోంది. 

ఈ నేపథ్యంలో ప్రతిపాదిత షెడ్యూల్‌ను సిద్ధం చేసింది.‌పరీక్షల షెడ్యూల్‌ వర్సిటీ పరిధిలోని అన్నీ కాలేజీల్లో ఈ నెల 20 నుంచి బీటెక్‌, ఫార్మా, ఇతర కోర్సులకు సంబంధించిన పరీక్షల నిర్వహణకు జేఎన్‌టీయూ హైదరాబాద్‌ ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో పరీక్షల నిర్వహణ తేదీల విషయంలో ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చినట్లు అర్థమవుతోంది.

ప్రతిపాదిత పరీక్షల షెడ్యూలు:

1. జూన్‌ 20 నుంచి - బీటెక్‌/బీఫార్మసీ (ఫైనల్‌ ఇయర్‌)- సెకండ్‌ సెమిస్టర్ పరీక్షలు‌, ఎంబీఏ/ఎంసీఏ (సెకండ్‌ ఇయర్‌)- సెకండ్‌ సెమిస్టర్‌ రెగ్యులర్‌ పరీక్షలు ఉంటాయి.

2. జులై 16 నుంచి - బీటెక్‌/బీఫార్మసీ ఫస్టియర్‌, సెకండ్‌ ఇయర్‌, థర్డ్‌ ఇయర్‌-సెకండ్‌ సెమిస్టర్‌ పరీక్షలు ఉంటాయి. అలాగే ఫార్మా-డి 2, 3, 4, 5 సెమిస్టర్‌ పరీక్షలు, ఫార్మా-డి (పీబీ) రెండో ఏడాది పరీక్షలు ఉంటాయి.

3. ఆగస్టు 8 నుంచి - బీటెక్‌/బీఫార్మసీ ఫస్ట్‌ఇయర్‌ నుంచి ఫోర్త్‌ ఇయర్‌ వరకు ఫస్ట్‌ సెమిస్టర్‌, సప్లిమెంటరీ పరీక్షలు, ఎంబీఏ/ఎంసీఏ ఫస్టియర్‌-సెకండ్‌ సెమిస్టర్‌ రెగ్యులర్ పరీక్షలుంటాయి. ఫస్టియర్‌, సెకండియర్‌, థర్డ్‌ ఇయర్‌ ఫస్ట్‌ సెమిస్టర్‌ (ఎంసీఏ) సప్లిమెంటరీ, ఫార్మా-డి మొదటి ఏడాది రెగ్యులర్‌, సప్లిమెంటరీ పరీక్షలుండేలా ప్రణాళిక ఉండనుంది.

Popular posts from this blog

విద్యాహక్కు చట్టం-2009 (RTE - ACT)

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం