ఏకకాలంలో 25 ప్రభుత్వ స్కూళ్లలో పనిచేస్తూ సుమారు రూ.కోటి సంపాదించిన ఓ టీచర్‌ వ్యవహారం బయటపడింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఉపాధ్యాయురాలు అనామిక శుక్ల పలు పాఠశాలల్లో పని చేస్తున్నట్లు ఆనలైన్‌ రికార్డుల ద్వారా తెలిసింది. అధికారులు దీనిపై ఆరా తీయగా కస్తురీబా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ)లో పూర్తిస్థాయి టీచర్‌గా పని చేస్తున్న ఆమె పలు జిల్లాల్లోని స్కూళ్లలోనూ పనిచేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది.

అలాగే అన్ని స్కూళ్లతో కలిసి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 13 నెలలు పాటు కోటి రుపాయలు జీతంగా తీసుకున్నట్లు బయటపడింది. ఆమె ఒకే సమయంలో ఇన్ని స్కూళ్లలో బోధించడం ఎలా సాధ్యమంటూ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ ఏడాది మార్చిలో దీని గురించి ఫిర్యాదు అందడంతో దర్యాప్తు చేపట్టారు. కాగా ఈ విషయం బయటపడిన నాటి నుంచి ఆ ఉపాధ్యాయురాలు కనిపించకుండాపోయినట్లు సమాచారం. 

Popular posts from this blog

GK

చరిత్రలో ఈ రోజు జూన్ 10

నేటి ముఖ్యాంశాలు.. 13 Jun, 2020