Posts

చరిత్రలో ఈ రోజు 13 జూన్ 2020

Image
సంఘటనలు 1893 : మొదటి మహిళల గోల్ఫ్ ఛాంపియన్‌షిప్ రాయల లీథం అనే చోట నిర్వహించబడింది. 1974: ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు పశ్చిమ జర్మనీలో ప్రారంభమయ్యాయి. 1982: ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు స్పెయిన్లో ప్రారంభమయ్యాయి.  జననాలు 1831 : ప్రముఖ భౌతిక, గణిత శాస్త్రవేత్త జేమ్స్ క్లర్క్ మాక్స్‌వెల్ జననం (మ.1879) 1889 : సాలార్‌జంగ్ మ్యూజియం ప్రధాన సేకరణ కర్త మీర్ యూసుఫ్ అలీఖాన్ (మూడవ సాలార్‌జంగ్) జననం.(మ.1949). 1896: కిరికెర రెడ్డి భీమరావు, తెలుగు, కన్నడ భాషలలో కవిత్వమల్లినవాడు. (మ.1964) 1909: ఇ.ఎం.ఎస్.నంబూద్రిపాద్ జననం (మ.1998). 1930: మార్పు బాలకృష్ణమ్మ, ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులుగా పనిచేశారు. (మ.2013) 1937: డా.రాజ్ రెడ్డి, ఒక కంప్యూటర్ శాస్త్రవేత్త, టూరింగ్ అవార్డు గ్రహీత, కంప్యూటర్ సైన్సు, కృత్రిమ మేధస్సు పై ఖ్యాతి గడించాడు. 1965: మణీందర్ సింగ్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు. మరణాలు 1719: రఫీయుల్ దర్జత్, భారతదేశపు 10వ మొఘల్ చక్రవర్తి. (జ.1699) 1962: కప్పగల్లు సంజీవమూర్తి, ఉపాధ్యాయుడు, రచయిత. (జ.1894) 2013: తరిట్ల ధర్మారావు, మధ్యప్రదేశ్ ఇండ...

యూజీ పరీక్షలు వాయిదా..

Image
జూలై 12న అంబేద్కర్‌ వర్సిటీ అర్హత పరీక్ష... డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయ అర్హత పరీక్ష-2020ని తెలుగు రాష్ట్రాల్లో జూలై 12న  నిర్వహించనున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 25వ తేదీలోపు ఆన్‌లైన్‌లో రిజిస్ర్టేషన్‌ చేసుకోవచ్చు. యూజీ పరీక్షలు వాయిదా.. అంబేద్కర్‌ వర్సిటీలో వివిధ యూజీ పరీక్షలు వాయిదాపడ్డాయి. బీఈడీ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) మొదటి సెమిస్టర్‌, బీఈడీ (బ్యాక్‌లాగ్‌), ఎంబీఏ (హాస్పిటల్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ మేనేజ్‌మెంట్‌) పరీక్షలు; బీఏ, బీకాం, బీఎస్సీ వార్షిక పరీక్షలు; డిగ్రీ మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్‌ (సీబీఎస్‌) పరీక్షలను వాయిదా వేశారు. వీటిని తిరిగి జూలైలో నిర్వహించే అవకాశాలున్నాయి. డిగ్రీ ఓల్డ్‌ బ్యాచ్‌ విద్యార్థులు ఈ నెల 20వ తేదీలోపు పూర్తి వివరాలతో రిజిస్ర్టేషన్‌ చేసుకోవాలని అధికారులు సూచించారు.

చరిత్రలో ఈ రోజు జూన్ 10

Image
సంఘటనలు 1966: భారత వాయుసేనకు సంబంధించిన రష్యన్ మిగ్ విమానాల తయారీ నాసిక్ లో ప్రారంభమయ్యింది. 1998: ప్రపంచ కప్పు ఫుట్‌బాల్ పోటీలు ఫ్రాన్సు లో ప్రారంభమయ్యాయి. జననాలు 1892: పొణకా కనకమ్మ, కస్తూరిబాయి మహిళా విద్యాకేంద్రమును స్థాపించారు, కొంతకాలం జమీన్ రైతు పత్రిక నడిపారు. (మ.1963) 1908: ఈశ్వరప్రభు, హేతువాది, చందమామ పత్రిక సంపాదకవర్గ సభ్యుడిగా పనిచేశారు. 1916: పైడిమర్రి సుబ్బారావు, బహుభాషావేత్త, భారత జాతీయ ప్రతిజ్ఞ (భారతదేశం నా మాతృభూమి...) రచయిత. (మ.1988) 1922: జూడీ గార్లాండ్, అమెరికాకు చెందిన నటి, గాయకురాలు, అభినేత్రి. (మ.1969) 1938: రాహుల్ బజాజ్, భారత పారిశ్రామిక వేత్త. 1951: మంగు రాజా, మ్యూజికాలజిస్ట్ గా సేవలందించడమే కాకుండా, రాజా తనలోని సృజనాత్మక రచనా సామర్ధ్యాలతో కథలు, నవలలు, సీరియల్స్ కూడా రాశారు. 1958: ఇ.వి.వి.సత్యనారాయణ, తెలుగు సినిమా దర్శకుడు. (మ.2011) 1960: నందమూరి బాలకృష్ణ, తెలుగు సినిమా నటుడు. మరణాలు 1836: ఆంధ్రి మారీ ఆంపియర్, ప్రెంచ్ భౌతిక శాస్త్రవేత్త (జ.1775) 1928: చీరాల పేరాల ఉద్యమానికి నాయకత్వం వహించిన భారత స్వాతంత్ర్య సమరయోధుడు,  దుగ్గిర...

పదవ తరగతి తర్వాత చదివే కోర్సులకు ముఖ్య తేదీలు వివరాలు..

Image
గ్రికల్చర్ డిప్లొమా మరియు ఇంజనీరింగ్ డిప్లమా ప్రవేశ పరీక్ష (పాలిటెక్నిక్) దరఖాస్తులు సమర్పించడానికి.. చివరి తేదీ 9 జూన్ 2020. పరీక్ష తేదీ 1 జూలై 2020. మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల జూనియర్ కళాశాల ప్రవేశ పరీక్ష దరఖాస్తు సమర్పించడానికి.. చివరి తేదీ 12 జూలై 2020. పరీక్ష తేదీ ఇంకా నిర్ణయించబడ లేదు. టీఎస్ ఆర్ జె సి ప్రవేశపరీక్ష దరఖాస్తు సమర్పించడానికి... చివరితేదీ 10 జూలై 2020  పరీక్ష తేదీ ఇంకా నిర్ణయించబడ లేదు.

విద్యాహక్కు చట్టం-2009 (RTE - ACT)

Image
RTE - ACT భారతదేశం లో : 6 నుంచి 14 ఏండ్లలోపు ఉన్న బాలలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించటానికి ఉద్దేశించిన చట్టమే Right to Free a-d Compulsory Education- Act 2009.  ఈ విద్యాహక్కు చట్టం 2009 ఆగస్టు 28న రాష్ట్రపతి ఆమోదం పొందింది.  కేంద్ర ప్రభుత్వం 2009 ఆగస్టు 26న ఈ బిల్లును ఆమోదించింది.  జమ్ముకశ్మీర్ మినహా దేశంలోని అన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ చట్టం 2010 ఏప్రిల్ 1న అమల్లోకి వచ్చింది.  ఈ చట్టంలో 7 అధ్యాయాలు, 38 సెక్షన్లు, ఒక అనుబంధ షెడ్యూల్ ఉన్నాయి .  విద్యాహక్కు చట్టం ముఖ్యాంశాలు : అధ్యాయం -1 సెక్షన్-1  చట్టం పేరు: ఉచిత నిర్బంధ విద్య బాలల హక్కు చట్టం 2009  చట్టం పరిధి: జమ్ముకశ్మీర్ మినహా దేశం మొత్తం వర్తిస్తుంది.  చట్టం అమలు తేదీ: 2010, ఏప్రిల్ 1 సెక్షన్-2 6 నుంచి 14 ఏండ్ల మధ్య వయసున్నవారు బాలబాలికలు  ప్రాథమిక విద్య అంటే 1 నుంచి 8 తరగతి వరకు  క్యాపిటేషన్ ఫీజు అంటే బడి ప్రకటించిన ఫీజు కాకుండా ఇతర రూపాల్లో చెల్లించే చందాలు  స్థానిక ప్రభుత్వం అంటే నగరపాలక సంస్థ లేదా జిల్లా పరిషత్ లేదా గ్రామ...

చరిత్రలో ఈ రోజు జూన్ 9.

Image
సంఘటనలు 1900 : భారత స్వాతంత్ర్య సమరయోధుడు బిర్సా ముండా బ్రిటిష్ జైలులో అనూహ్యమైన రీతిలో మరణించాడు. 1964 : భారత ప్రధానమంత్రిగా లాల్ బహదూర్ శాస్త్రి నియమితుడైనాడు. 2006 : ప్రపంచ కప్పు సాకర్ పోటీలు జర్మనీలో ప్రారంభమయ్యాయి. జననాలు 1899: వామన్ శ్రీనివాస్ కుడ్వ, సిండికేట్ బ్యాంకు వ్యవస్థాపకులలో ఒకరు. (మ.1967) 1912: ఉమ్మెత్తల గోపాలరావు, నిజాం నిరంకుశ పాలన వ్యతిరేక ఉద్యమకారుడు. 1931: నందిని సత్పతీ, ఒరిస్సా మాజీ ముఖ్యమంత్రి (మ.2006) 1947: గాలి ముద్దుకృష్ణమ నాయుడు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజకీయనాయకుడు. (మ.2018) 1949: కిరణ్‌ బేడీ, భారత దేశ మహిళా పోలీసు అధికారి, సామాజిక కార్యకర్త. 1951: తెలంగాణ శకుంతల, తెలుగు సినిమా రంగంలో క్యారెక్టర్ నటి, ప్రతినాయకురాలు, హాస్య నటి. (మ.2014) 1954: ఎం. ఎఫ్. గోపీనాథ్, తెలుగు రచయిత, రాజకీయ విశ్లేషకుడు, భారతదేశపు తొలి దళిత కార్డియాలజిస్టు. 1959: జి.వి.హర్షకుమార్, భారత పార్లమెంటు సభ్యుడు, ఇతడు 14వ లోక్‌సభకు ఆంధ్రప్రదేశ్ లోని అమలాపురం లోక్‌సభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా ఎన్నికయ్యారు. 1977: రూపా మిశ్రా, భారతీయ సామాజిక క...

GK

Image
1)దేశవ్యాప్తంగా BS-VI ఇంధన సరఫరాను ప్రారంభించిన దేశంలో మొదటి సంస్థ? జ: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్. 2) కరోనా వైరస్‌ను నివారించడానికి ప్రజలు అనుసరించాల్సిన ఐదు విషయాలను తెలిపే ‘Do the Five. Help stop Coronavirus’ అనే ప్రచారాన్ని ప్రారంభించింది? జ: గూగుల్. 3) దేశంలో మొదటిసారిగా ఏ రాష్ట్ర పోలీసులు టేజర్ తుపాకులను ప్రవేశపెట్టారు? జ: గుజరాత్. 4) మహిళల సాధికారత కోసం ప్రభుత్వం 20,466.94 కోట్ల రూపాయలు (మార్చి 10, 2020 వరకు) ఏ పథకం కింద మంజూరు చేసింది? జ: స్టాండ్ అప్ ఇండియా. 5) ‘Messiah Modi: A tale of Great expectations’ పుస్తకాన్ని ఎవరు రచించారు? జ: తవ్లీన్ సింగ్. 6) రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతిలో రిజర్వేషన్లను ఏ రాష్ట్రం రద్దు చేసింది? జ: ఉత్తరాఖండ్. 7) COVID-19 మహమ్మారి గురించి పౌరులలో అవగాహన కల్పించడానికి ప్రభుత్వం 'MyGov Corona Helpdesk' ను ఏ సోషల్ నెట్వర్క్ ప్లాట్‌ఫామ్‌లో ప్రారంభించింది? జ: వాట్సాప్. 8) పోలీస్ స్టేషన్ విజిటర్ సర్వే సిస్టమ్, ఇ-నైట్ బీట్ చెకింగ్ సిస్టమ్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? జ: హిమాచల్ ప్రదేశ్. 9)...