Posts

Showing posts from 2020

ప్రధానమంత్రి ( విద్యాలక్ష్మీ ) ఎడ్యుకేషన్ లోన్.. ఇలా అప్లై చేయండి..

Image
ఆర్థిక పరిస్థితి సరిగా లేని విద్యార్థులకోసం కేంద్రప్రభుత్వం ప్రధానమంత్రి విద్యా లక్ష్మీ ఎడ్యుకేషన్ లోన్ స్కీమ్‌ని ప్రవేశపెట్టింది. ఈ లోన్‌ పొందాలంటే వివరాలు ఏంటో తెలుసుకోండి..  ప్రధానమంత్రి విద్యా లక్ష్మీ ఎడ్యుకేషన్ లోన్ స్కీమ్ ద్వారా పేద విద్యార్థులకు ఆర్థిక సాయం చేసేందుకు కేంద్రప్రభుత్వం చర్యలు చేపట్టింది.. ఆర్థికస్థోమత తక్కువగా ఉన్నవారు పైచదువులు చదివేందుకు ఈ లోన్ సదుపాయం చక్కగా ఉపయోగ పడుతుంది. ఇందులో 22 వేర్వేరు విద్యారుణాలున్నాయి. లోన్ పొందేందుకు అర్హతలు: ఇంటర్మీడియెట్ పూర్తి చేసి ఉండాలి. విద్యార్థుల తల్లీదండ్రులు ఆదాయ సర్టిఫికెట్స్ ఉండాలి. లోన్ ఎలా అప్లై చేయాలంటే.. ముందుగా..    Link : http://www.vidyalakshmi.co.in /   వెబ్‌సైట్‌లో మన పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. మన డీటెయిల్స్‌ని బట్టి ఎంతవరకూ లోన్ పొందొచ్చో తెలుసుకోవచ్చు. మన వివరాలు చూసి పరీక్షించిన బ్యాంక్స్ మనం లోన్‌ తీసుకునేందుకు అర్హులో.. కాదో తెలియజేస్తాయి. ఒకవేళ మనం అర్హులైతే నగదు నేరుగా మనం ఇచ్చిన అకౌంట్‌లో చేరుతుంది. ఒకవేళ మీ అప్లికేషన్ హోల్డ్‌లో ఉంటే.. మన నుంచి బ్యాంక్ ...

ఇంటర్మీడియట్ ఫలితాలు... Websites

Image
#Results తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు... మొదటి సంవత్సరం... http://results.eenadu.net/ts-inter-2020/ts-inter-1st-year-results-2020-general.aspx https://eduresults.sakshi.com/ https://tsbie.cgg.gov.in/ http://bie.telangana.gov.in/ రెండో సంవత్సరం... http://results.eenadu.net/ts-inter-2020/ts-inter-2nd-year-results-2020-general.aspx http://www.sakshieducation.com/ https://tsbie.cgg.gov.in/ http://bie.telangana.gov.in/

తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదల

Image
తెలంగాణ ఇంటర్మీడియెట్‌ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలను నాంపల్లిలోని ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేశారు. గత మార్చి నెలలో జరిగిన ఈ పరీక్షలకు 9.65 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలను  4,80,555 మంది విద్యార్థులు హాజరుకాగా, 67.47 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఎప్పటిలాగానే ఫలితాల్లో బాలికలు ముందంజలో ఉన్నారు. బాలికలు 60శాతం, బాలురు 52.30 శాతం ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్‌ పరీక్షలను 4,11,631 మంది విద్యార్థులు రాయగా, 68.86శాతం ఉత్తీర్ణత సాధించారు. వారిలో బాలికలు 75.15 శాతం, బాలురు 62.10 శాతం పాసయ్యారు. ఇంటర్‌ ఫలితాల్లో 76 శాతం ఉత్తీర్ణతతో కొమురం భీం ఆసీఫాబాద్‌ జిల్లాకు అగ్రస్థానం దక్కగా.. 75 శాతంతో మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా ద్వితీయ స్థానంలో నిలిచింది. ఫలితాల విడుదల సందర్భంగా మంత్రి సబితా ఇంద్రా రెడ్డి మాట్లాడుతూ.. అన్ని జాగ్రత్తలు తీసుకుని పరీక్షలు నిర్వహించామన్నారు.విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వాల్యుయేష...

ఆధార్‌తో ఎస్‌బీఐ ఆన్‌లైన్‌ సేవింగ్స్‌ అకౌంట్‌

Image
 ఆధార్‌ నంబర్‌తో ఇన్‌స్టంట్‌గా డిజిటల్‌ సేవింగ్స్‌ అకౌంట్‌ను తెరిచే సౌలభ్యాన్ని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) పునః ప్రారంభించింది. ఇందుకోసం యోనో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అందులో పాన్‌, ఆధార్‌ వివరాలతో పాటు ఓటీపీని నమోదు చేయాల్సి ఉంటుంది. అనంతరం ఇతర వివరాలు ఇవ్వాలి. నామినేషన్‌ సదుపాయం కూడా ఉంది. ఆన్‌లైన్‌లో ఖాతా తెరిచిన వారికి రూపే ఏటీఎం, డెబిట్‌ కార్డును జారీ చేస్తారు. కాగితం అవసరం లేకుండానే ఇన్‌స్టా సేవింగ్స్‌ బ్యాంక్‌ ఖాతాను  పాన్‌, ఆధార్‌ వివరాలతో తెరవొచ్చని ఎస్‌బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. ఇదంతా బ్యాంక్‌ శాఖను సందర్శించకుండానే సాధ్యమౌతుందని ఎస్‌బీఐ ఛైర్మన్‌ రజనీశ్‌ కుమార్‌ పేర్కొన్నారు. పూర్తి కేవైసీ అప్‌డేట్‌ చేసేందుకు ఏడాదిలో ఎప్పుడైనా సమీప బ్రాంచ్‌ను సంప్రదించొచ్చని ఎస్‌బీఐ తెలిపింది.

నేటి ముఖ్యాంశాలు.. 13 Jun, 2020

జాతీయం  ఈ నెల 16,17 తేదీల్లో సీఎంలతోప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌   16న కేంద్రపాలిత ప్రాంతాలు, 12 రాష్ట్రాల సీఎంలతో మాట్లాడనున్న ప్రధాని  17న ఏపీ, తెలంగాణ సహా 15 రాష్ట్రాల సీఎంలతో మాట్లాడనున్న ప్రధాని  లాక్‌డౌన్‌ పరిణామాలు, ప్రస్తుతం దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతర అంశాలపై చర్చించనున్న ప్రధాని మోదీ దేశంలో మొత్తం 2,97,535 కరోనా పాజిటివ్‌ కేసులు  ఇప్పటివరకు 1,47,195 మంది డిశ్చార్జ్‌, 8,498 మంది మృతి  దేశంలో ప్రస్తుతం 1,41,842 యాక్టివ్‌ కేసులు  దేశంలో49 శాతానికి చేరిన కరోనా రికవరీ రేటు  దేశంలో ఇప్పటి వరకు 53,63,445 మందికి కరోనా పరీక్షలు ఎన్నికలకు ముందు ట్రంప్‌ మరో దుందుడుకు ఆలోచన  కొత్తగా ఇచ్చే H1B వీసాలను సస్పెండ్‌ చేసే యోచన  H1Bతో పాటు H2B, J1, L1 వీసాలు కూడా సస్పెండ్‌ చేసే యోచన తెలంగాణ  జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి కరోనా పాజిటవ్‌  రెండుసార్లు పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ ఏపీ  గత 24 గంటల్లో 11,775 మందికి పరీక్షలు, 141 పాజిటివ్‌  ఇప్పట...

దోస్త్‌-2020 షెడ్యూల్ రెడీ..!

తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఈ నెల 15 లేదా 16వ తేదీన షెడ్యూల్‌ విడుదల కానున్నది. ఈ మేరకు డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌-2020) అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇంటర్మీడియట్‌ సెకండియర్‌ ఫలితాలు ఈ నెల 15న విడుదల కానున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా షెడ్యూల్‌ రూపొందించే పనిలో పడ్డారు అధికారులు. 2020-21 విద్యాసంవత్సరానికి జూలై, ఆగస్టులో దశవారీగా అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్ారు. డిగ్రీ ఆడ్మిషన్లను చేపట్టి ఆగస్టు 24 వరకు పూర్తిచేయనున్నారు యూజీసీ మార్గదర్శకాలను అనుసరించి మొదటి సంవత్సరం తరగతులను సెప్టెంబర్‌ ఒకటి నుంచి, ద్వితీయ, తృతీయ సంవత్సరం తరగతులను ఆగస్టు ఒకటినుంచి ప్రారంభించాల్సి ఉంది. ఈ మేరకు షెడ్యూల్‌ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. కరోనా నిబంధనలు పాటిస్తూనే డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియ చేపట్టనున్నారు. ఆన్‌లైన్‌ ద్వారా అడ్మిషన్ల నిర్వహణకు సీజీజీ సహకారం అందిస్తున్నది. విద్యార్థులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించడం కోసం వాట్సాప్‌, ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ వంటి సోషల్ మీడియాను ఉపయోగించనున్నారు. ఇక కాలేజీలను ఎప్పుడు తెరుస్తారన...

నేటి ముఖ్యాంశాలు.. 13 Jun, 2020

రాగల 24 గంటల్లో తెలంగాణలో భారీ వర్ష సూచన ఢిల్లీలోని ప్రభుత్వ ఆస్పత్రులు సరైన రీతిలో స్పందించడం లేదని సుప్రీం కోర్టు సీరియస్ సరిహద్దుల దగ్గర చైనాతో చర్చించిన భారత్ మాతో ఎందుకు చర్చించదు అని నేపాల్ విదేశాంగమంత్రి ప్రశ్న ఆన్ లైన్ క్లాసుల వల్ల చూపు మందగించడం, కళ్ళు మంటలు, లాంటి సైడ్ ఎఫెక్ట్స్ తో పిల్లలు ఇబ్బంది పడుతున్నారని కొంతమంది తల్లిదండ్రుల ఫిర్యాదులు తెలంగాణలోని డిగ్రీ కళాశాలల ప్రవేశాల కోసం (దోస్త్-2020)ఈనెల 15 లేదా 16న షెడ్యూల్ విడుదల ప్రముఖ మొబైల్ సంస్థ నోకియా ఒకసారి ఛార్జింగ్ పెడితే 30 రోజులు బ్యాటరీ వస్తుందని ఈ మొబైల్ త్వరలో మార్కెట్కు రానుందని సంస్థ ప్రతినిధుల వెల్లడి  లాక్ డౌన్ కారణంగా కుదేలు అయిపోయిన చిరు వ్యాపారులకు మే జూన్ జూలై నెలలకు  జి ఎస్ టి ఆర్- 3 బి ఫామ్ లను సెప్టెంబర్ లోగా ఫైన్ లేకుండా  దాఖలు చేసే వెసులుబాటు ను కల్పించిన కేంద్రం నల్లగొండ పద్మావతి కాలనీ లో ఇండ్లలో పని చేసుకుని జీవనం సాగించే మాధవి అనే మహిళ ఇంటికి ఏకంగా 19 లక్షల కరెంట్ బిల్లు సూర్యాపేట జిల్లా నడిగూడెం లో లాటరీ పేరుతో  బురిడీ కొట్టించి రెండు లక్షలు దం...

చరిత్రలో ఈ రోజు 13 జూన్ 2020

Image
సంఘటనలు 1893 : మొదటి మహిళల గోల్ఫ్ ఛాంపియన్‌షిప్ రాయల లీథం అనే చోట నిర్వహించబడింది. 1974: ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు పశ్చిమ జర్మనీలో ప్రారంభమయ్యాయి. 1982: ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు స్పెయిన్లో ప్రారంభమయ్యాయి.  జననాలు 1831 : ప్రముఖ భౌతిక, గణిత శాస్త్రవేత్త జేమ్స్ క్లర్క్ మాక్స్‌వెల్ జననం (మ.1879) 1889 : సాలార్‌జంగ్ మ్యూజియం ప్రధాన సేకరణ కర్త మీర్ యూసుఫ్ అలీఖాన్ (మూడవ సాలార్‌జంగ్) జననం.(మ.1949). 1896: కిరికెర రెడ్డి భీమరావు, తెలుగు, కన్నడ భాషలలో కవిత్వమల్లినవాడు. (మ.1964) 1909: ఇ.ఎం.ఎస్.నంబూద్రిపాద్ జననం (మ.1998). 1930: మార్పు బాలకృష్ణమ్మ, ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులుగా పనిచేశారు. (మ.2013) 1937: డా.రాజ్ రెడ్డి, ఒక కంప్యూటర్ శాస్త్రవేత్త, టూరింగ్ అవార్డు గ్రహీత, కంప్యూటర్ సైన్సు, కృత్రిమ మేధస్సు పై ఖ్యాతి గడించాడు. 1965: మణీందర్ సింగ్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు. మరణాలు 1719: రఫీయుల్ దర్జత్, భారతదేశపు 10వ మొఘల్ చక్రవర్తి. (జ.1699) 1962: కప్పగల్లు సంజీవమూర్తి, ఉపాధ్యాయుడు, రచయిత. (జ.1894) 2013: తరిట్ల ధర్మారావు, మధ్యప్రదేశ్ ఇండ...

యూజీ పరీక్షలు వాయిదా..

Image
జూలై 12న అంబేద్కర్‌ వర్సిటీ అర్హత పరీక్ష... డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయ అర్హత పరీక్ష-2020ని తెలుగు రాష్ట్రాల్లో జూలై 12న  నిర్వహించనున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 25వ తేదీలోపు ఆన్‌లైన్‌లో రిజిస్ర్టేషన్‌ చేసుకోవచ్చు. యూజీ పరీక్షలు వాయిదా.. అంబేద్కర్‌ వర్సిటీలో వివిధ యూజీ పరీక్షలు వాయిదాపడ్డాయి. బీఈడీ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) మొదటి సెమిస్టర్‌, బీఈడీ (బ్యాక్‌లాగ్‌), ఎంబీఏ (హాస్పిటల్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ మేనేజ్‌మెంట్‌) పరీక్షలు; బీఏ, బీకాం, బీఎస్సీ వార్షిక పరీక్షలు; డిగ్రీ మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్‌ (సీబీఎస్‌) పరీక్షలను వాయిదా వేశారు. వీటిని తిరిగి జూలైలో నిర్వహించే అవకాశాలున్నాయి. డిగ్రీ ఓల్డ్‌ బ్యాచ్‌ విద్యార్థులు ఈ నెల 20వ తేదీలోపు పూర్తి వివరాలతో రిజిస్ర్టేషన్‌ చేసుకోవాలని అధికారులు సూచించారు.

చరిత్రలో ఈ రోజు జూన్ 10

Image
సంఘటనలు 1966: భారత వాయుసేనకు సంబంధించిన రష్యన్ మిగ్ విమానాల తయారీ నాసిక్ లో ప్రారంభమయ్యింది. 1998: ప్రపంచ కప్పు ఫుట్‌బాల్ పోటీలు ఫ్రాన్సు లో ప్రారంభమయ్యాయి. జననాలు 1892: పొణకా కనకమ్మ, కస్తూరిబాయి మహిళా విద్యాకేంద్రమును స్థాపించారు, కొంతకాలం జమీన్ రైతు పత్రిక నడిపారు. (మ.1963) 1908: ఈశ్వరప్రభు, హేతువాది, చందమామ పత్రిక సంపాదకవర్గ సభ్యుడిగా పనిచేశారు. 1916: పైడిమర్రి సుబ్బారావు, బహుభాషావేత్త, భారత జాతీయ ప్రతిజ్ఞ (భారతదేశం నా మాతృభూమి...) రచయిత. (మ.1988) 1922: జూడీ గార్లాండ్, అమెరికాకు చెందిన నటి, గాయకురాలు, అభినేత్రి. (మ.1969) 1938: రాహుల్ బజాజ్, భారత పారిశ్రామిక వేత్త. 1951: మంగు రాజా, మ్యూజికాలజిస్ట్ గా సేవలందించడమే కాకుండా, రాజా తనలోని సృజనాత్మక రచనా సామర్ధ్యాలతో కథలు, నవలలు, సీరియల్స్ కూడా రాశారు. 1958: ఇ.వి.వి.సత్యనారాయణ, తెలుగు సినిమా దర్శకుడు. (మ.2011) 1960: నందమూరి బాలకృష్ణ, తెలుగు సినిమా నటుడు. మరణాలు 1836: ఆంధ్రి మారీ ఆంపియర్, ప్రెంచ్ భౌతిక శాస్త్రవేత్త (జ.1775) 1928: చీరాల పేరాల ఉద్యమానికి నాయకత్వం వహించిన భారత స్వాతంత్ర్య సమరయోధుడు,  దుగ్గిర...

పదవ తరగతి తర్వాత చదివే కోర్సులకు ముఖ్య తేదీలు వివరాలు..

Image
గ్రికల్చర్ డిప్లొమా మరియు ఇంజనీరింగ్ డిప్లమా ప్రవేశ పరీక్ష (పాలిటెక్నిక్) దరఖాస్తులు సమర్పించడానికి.. చివరి తేదీ 9 జూన్ 2020. పరీక్ష తేదీ 1 జూలై 2020. మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల జూనియర్ కళాశాల ప్రవేశ పరీక్ష దరఖాస్తు సమర్పించడానికి.. చివరి తేదీ 12 జూలై 2020. పరీక్ష తేదీ ఇంకా నిర్ణయించబడ లేదు. టీఎస్ ఆర్ జె సి ప్రవేశపరీక్ష దరఖాస్తు సమర్పించడానికి... చివరితేదీ 10 జూలై 2020  పరీక్ష తేదీ ఇంకా నిర్ణయించబడ లేదు.

విద్యాహక్కు చట్టం-2009 (RTE - ACT)

Image
RTE - ACT భారతదేశం లో : 6 నుంచి 14 ఏండ్లలోపు ఉన్న బాలలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించటానికి ఉద్దేశించిన చట్టమే Right to Free a-d Compulsory Education- Act 2009.  ఈ విద్యాహక్కు చట్టం 2009 ఆగస్టు 28న రాష్ట్రపతి ఆమోదం పొందింది.  కేంద్ర ప్రభుత్వం 2009 ఆగస్టు 26న ఈ బిల్లును ఆమోదించింది.  జమ్ముకశ్మీర్ మినహా దేశంలోని అన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ చట్టం 2010 ఏప్రిల్ 1న అమల్లోకి వచ్చింది.  ఈ చట్టంలో 7 అధ్యాయాలు, 38 సెక్షన్లు, ఒక అనుబంధ షెడ్యూల్ ఉన్నాయి .  విద్యాహక్కు చట్టం ముఖ్యాంశాలు : అధ్యాయం -1 సెక్షన్-1  చట్టం పేరు: ఉచిత నిర్బంధ విద్య బాలల హక్కు చట్టం 2009  చట్టం పరిధి: జమ్ముకశ్మీర్ మినహా దేశం మొత్తం వర్తిస్తుంది.  చట్టం అమలు తేదీ: 2010, ఏప్రిల్ 1 సెక్షన్-2 6 నుంచి 14 ఏండ్ల మధ్య వయసున్నవారు బాలబాలికలు  ప్రాథమిక విద్య అంటే 1 నుంచి 8 తరగతి వరకు  క్యాపిటేషన్ ఫీజు అంటే బడి ప్రకటించిన ఫీజు కాకుండా ఇతర రూపాల్లో చెల్లించే చందాలు  స్థానిక ప్రభుత్వం అంటే నగరపాలక సంస్థ లేదా జిల్లా పరిషత్ లేదా గ్రామ...

చరిత్రలో ఈ రోజు జూన్ 9.

Image
సంఘటనలు 1900 : భారత స్వాతంత్ర్య సమరయోధుడు బిర్సా ముండా బ్రిటిష్ జైలులో అనూహ్యమైన రీతిలో మరణించాడు. 1964 : భారత ప్రధానమంత్రిగా లాల్ బహదూర్ శాస్త్రి నియమితుడైనాడు. 2006 : ప్రపంచ కప్పు సాకర్ పోటీలు జర్మనీలో ప్రారంభమయ్యాయి. జననాలు 1899: వామన్ శ్రీనివాస్ కుడ్వ, సిండికేట్ బ్యాంకు వ్యవస్థాపకులలో ఒకరు. (మ.1967) 1912: ఉమ్మెత్తల గోపాలరావు, నిజాం నిరంకుశ పాలన వ్యతిరేక ఉద్యమకారుడు. 1931: నందిని సత్పతీ, ఒరిస్సా మాజీ ముఖ్యమంత్రి (మ.2006) 1947: గాలి ముద్దుకృష్ణమ నాయుడు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజకీయనాయకుడు. (మ.2018) 1949: కిరణ్‌ బేడీ, భారత దేశ మహిళా పోలీసు అధికారి, సామాజిక కార్యకర్త. 1951: తెలంగాణ శకుంతల, తెలుగు సినిమా రంగంలో క్యారెక్టర్ నటి, ప్రతినాయకురాలు, హాస్య నటి. (మ.2014) 1954: ఎం. ఎఫ్. గోపీనాథ్, తెలుగు రచయిత, రాజకీయ విశ్లేషకుడు, భారతదేశపు తొలి దళిత కార్డియాలజిస్టు. 1959: జి.వి.హర్షకుమార్, భారత పార్లమెంటు సభ్యుడు, ఇతడు 14వ లోక్‌సభకు ఆంధ్రప్రదేశ్ లోని అమలాపురం లోక్‌సభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా ఎన్నికయ్యారు. 1977: రూపా మిశ్రా, భారతీయ సామాజిక క...

GK

Image
1)దేశవ్యాప్తంగా BS-VI ఇంధన సరఫరాను ప్రారంభించిన దేశంలో మొదటి సంస్థ? జ: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్. 2) కరోనా వైరస్‌ను నివారించడానికి ప్రజలు అనుసరించాల్సిన ఐదు విషయాలను తెలిపే ‘Do the Five. Help stop Coronavirus’ అనే ప్రచారాన్ని ప్రారంభించింది? జ: గూగుల్. 3) దేశంలో మొదటిసారిగా ఏ రాష్ట్ర పోలీసులు టేజర్ తుపాకులను ప్రవేశపెట్టారు? జ: గుజరాత్. 4) మహిళల సాధికారత కోసం ప్రభుత్వం 20,466.94 కోట్ల రూపాయలు (మార్చి 10, 2020 వరకు) ఏ పథకం కింద మంజూరు చేసింది? జ: స్టాండ్ అప్ ఇండియా. 5) ‘Messiah Modi: A tale of Great expectations’ పుస్తకాన్ని ఎవరు రచించారు? జ: తవ్లీన్ సింగ్. 6) రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతిలో రిజర్వేషన్లను ఏ రాష్ట్రం రద్దు చేసింది? జ: ఉత్తరాఖండ్. 7) COVID-19 మహమ్మారి గురించి పౌరులలో అవగాహన కల్పించడానికి ప్రభుత్వం 'MyGov Corona Helpdesk' ను ఏ సోషల్ నెట్వర్క్ ప్లాట్‌ఫామ్‌లో ప్రారంభించింది? జ: వాట్సాప్. 8) పోలీస్ స్టేషన్ విజిటర్ సర్వే సిస్టమ్, ఇ-నైట్ బీట్ చెకింగ్ సిస్టమ్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? జ: హిమాచల్ ప్రదేశ్. 9)...

GK

Image
1) కేంద్ర ప్రభుత్వ నిధుల సంస్థల నుంచి సబ్సిడీలు, ప్రోత్సాహకాలను పొందడానికి రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలకు సహాయం చేయడానికి "ఆగ్రో-ఎంటర్‌ప్రెన్యూర్ ఫెసిలిటేషన్ డెస్క్" ను ఏ రాష్ట్రం ప్రారంభించింది? జ: త్రిపుర. 1) Which state has launched the "Agro-Entrepreneur Facilitation Desk" to help entrepreneurs in the state to get subsidies and incentives from central government funded institutions? Ans: Tripura. 2) కరోనా వైరస్‌ను వేడి చేయడం ద్వారా విచ్ఛిన్నం చేయడానికి పూణేకు చెందిన డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ (DIAT) అభివృద్ధి చేసిన మైక్రోవేవ్ స్టెరిలైజర్ పేరు ఏమిటి? జ: Atulya. 2) What is the name of the microwave sterilizer developed by Pune's Defense Institute of Advanced Technology (DIAT) to break the corona virus by heating? Ans: Atulya. 3) యూఎస్ ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌ ప్రకారం యూఎస్ ప్రభుత్వ సెక్యూరిటీల అత్యధిక విలువ(1.268 ట్రిలియన్ డాలర్లు) కలిగిన దేశం ఏది? జ: జపాన్. 3) According to the US Treasury Department, which co...

చరిత్ర లో ఈరోజు జూన్ 7.

Image
సంఘటనలు 1893: గాంధీజీ మొట్టమొదటి సహాయ నిరాకరణ. 1935: ఫ్రాన్స్ దేశానికి మొట్టమొదటి ప్రధాన మంత్రిగా పియెర్రీ లెవాల్. 1965: పెళ్ళి అయిన జంటలకు గర్భ నిరోధ పద్ధతులను చట్టబద్దం చేస్తూ, అమెరికా సుప్రీం కోర్టు తీర్పు. 1966: మాజీ హాలీవుడ్ సినిమా నటుడు, రోనాల్డ్ రీగన్ 33వ కాలిఫోర్నియా గవర్నరు అయ్యాడు. 1967: ఆరు రోజుల యుద్ధంలో జెరూసలేం నగరంలోనికి ప్రవేశించిన ఇజ్రాయెల్ సైనికులు. 1975: బీటా మాక్స్ వీడియో క్యాసెట్ రికార్డరును సోనీ విపణిలో ప్రవేశపెట్టింది. 1979: భాస్కర-1 అనే భారతీయ ఉపగ్రహం ప్రయోగించబడింది. 1981: ఒపెరా పేరుతో ఇరాక్‌ లోని ఒసిరాక్ న్యూక్లియర్ రియాక్టరును ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. 1991: అగ్ని పర్వతం పినతూబో పేలి, 7 కి.మీ (4.5 మై) ఎత్తుకు బూడిద చిమ్మింది. జననాలు 1943: రాయపాటి సాంబశివరావు, భారత పార్లమెంటు సభ్యుడు 1974: మహేష్ భూపతి, భారత టెన్నిస్ క్రీడాకారుడు. మరణాలు 1967: డొరొతీ పార్కర్, అమెరికాకు చెందిన కవయిత్రి, రచయిత్రి. (జ. 1893) 2002: బసప్ప దానప్ప శెట్టి, భారత రాజకీయ వేత్త, 5 వ ఉప రాష్ట్రపతి. (జ. 1912) 2005: బొల్లిముంత శివరామకృష్ణ, అభ్యుదయ రచయిత, ప్ర...

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు వాయిదా

Image
పదో తరగతి పరీక్షలను వాయిదా వేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి పరీక్షలపై విచారణ జరిపిన హైకోర్టు జీహెచ్‌ఎంసీ, రంగారెడ్డి జిల్లాలు మినహా మిగిలిన ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించుకోవచ్చంటూ తీర్పును ఇచ్చింది. అయితే ఇది సాధ్యం కాదని భావించిన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా తీవ్రత తగ్గిన తరువాతే పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీంతో ఈ నెల 8 నుంచి జరగాల్సిన పదో తరగతి పరీక్షలు మరోసారి వాయిదా పడ్డాయి.

చరిత్ర లో ఈరోజు జూన్- 6

Image
సంఘటనలు 1515 - శ్రీ కృష్ణ దేవ రాయలు కొండవీడును ముట్టడించాడు. కొండవీడు 1454 నుండి గజపతుల ఆధీనంలో ఉంది. ఇదే సమయంలో ప్రతాపరుద్ర గజపతి కృష్ణానది ఉత్తర భాగమున పెద్ద సైన్యంతో విడిదిచేసెను. ఈ యుద్ధమున రాయలు విజయం సాధించాడు. తరువాత రాయలు కొండవీడును అరవై రోజులు పోరాడి 1515 జూన్ 6న స్వాధీనం చేసుకున్నాడు. 1674 : మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ కి పట్టాభిషేకం జరిగిన రోజు. 1928 : ఆక్స్‌ఫర్డ్ నిఘంటువు మొదటి ప్రచురణ జేమ్స్ ముర్రే సంపాదకత్వంలో వెలువడింది జననాలు 1699: అజీజుద్దీన్ అలంఘీర్, మొఘల్ చక్రవర్తి. (మ.1759) 1799 : ఆధునిక రష్యా సాహిత్యానికి పితామహుడు అలెగ్జాండర్ పుష్కిన్ జననం (మ.1837). 1877: ఉళ్ళూర్ పరమేశ్వర అయ్యర్, మలయాళ కవి. (మ.1949) 1890: గోపీనాధ్ బొర్దొలాయి, స్వాతంత్ర్యానంతర అస్సాం రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి. (మ.1950) 1891 : ప్రముఖ కన్నడ రచయిత మాస్తి వెంకటేశ అయ్యంగార్ జననం (మ.1986). 1902: కె.ఎల్.రావు, ఇంజనీరు, రాజకీయ నాయకుడు, నాగార్జునసాగర్ ప్రాజెక్టు సాకారం కావడానికి ఈయన కృషి చేశాడు. (మ.1902) 1909: చోడగం అమ్మన్నరాజా, స్వాతంత్ర్య సమరయోధురాలు, రాజకీయ నాయకురాల...
Image
ఏకకాలంలో 25 ప్రభుత్వ స్కూళ్లలో పనిచేస్తూ సుమారు రూ.కోటి సంపాదించిన ఓ టీచర్‌ వ్యవహారం బయటపడింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఉపాధ్యాయురాలు అనామిక శుక్ల పలు పాఠశాలల్లో పని చేస్తున్నట్లు ఆనలైన్‌ రికార్డుల ద్వారా తెలిసింది. అధికారులు దీనిపై ఆరా తీయగా కస్తురీబా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ)లో పూర్తిస్థాయి టీచర్‌గా పని చేస్తున్న ఆమె పలు జిల్లాల్లోని స్కూళ్లలోనూ పనిచేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. అలాగే అన్ని స్కూళ్లతో కలిసి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 13 నెలలు పాటు కోటి రుపాయలు జీతంగా తీసుకున్నట్లు బయటపడింది. ఆమె ఒకే సమయంలో ఇన్ని స్కూళ్లలో బోధించడం ఎలా సాధ్యమంటూ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ ఏడాది మార్చిలో దీని గురించి ఫిర్యాదు అందడంతో దర్యాప్తు చేపట్టారు. కాగా ఈ విషయం బయటపడిన నాటి నుంచి ఆ ఉపాధ్యాయురాలు కనిపించకుండాపోయినట్లు సమాచారం. 

10వ తరగతి పరీక్షలపై కొనసాగుతున్న సస్పెన్స్

Image
టెన్త్‌ పరీక్షలపై ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు నిర్వహణపై సస్పెన్స్ కొనసాగుతోంది. కరోనావైరస్ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ఇప్పుడే 10వ తరగతి పరీక్షలు నిర్వహించడం అవసరమా అని ఇప్పటికే హైకోర్టు ( TS High court ) ప్రశ్నించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఇవాళ జరిగిన విచారణలోనూ హై కోర్టు పలు కీలకమైన ప్రశ్నలు లేవనెత్తింది. ఒకవేళ పరీక్షలు నిర్వహించడానికే సిద్ధమైతే మరి కంటైన్మెంట్ జోన్లలో ఉన్న టెన్త్ క్లాస్ విద్యార్థుల పరిస్థితేంటని హై కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అయితే, 10వ తరగతి పరీక్షలు ఇప్పుడు రాసుకోలేకపోయిన విద్యార్థులను సప్లిమెంటరీకి అనుమతి ఇస్తామని ప్రభుత్వం కోర్టుకు తెలియజేసింది. మరి సప్లిమెంటరీలో పాస్ అయితే రెగ్యులర్ విద్యార్థులుగా గుర్తిస్తారా అని హైకోర్టు సందేహం వ్యక్తంచేసింది. ఈ ప్రశ్నలన్నింటికీ రేపు సమాధానం చెప్పాలని వ్యాఖ్యానించిన హై కోర్టు.. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. హై కోర్టు ప్రశ్నలన్నింటికీ ప్రభుత్వాన్ని సంప్రదించి రేపు సమాధానం చెబుతామని అడ్వకేట్ జనరల్ బి.ఎస్. ప్రసాద్ కోర్టుకు తెలిపారు. ఎస్.ఎస్.సి ఎగ్జామ్స్ రీ...

యూపీఎస్సీ పరీక్షల కొత్త షెడ్యూల్‌

Image
యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌-2020 ప్రిలిమినరీ పరీక్ష అక్టోబర్‌ 4న జరగనుంది. దేశంలో కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ నేపథ్యంలో మే 31న జరగాల్సిన ప్రిలిమ్స్‌ పరీక్ష వాయిదాపడింది. ఈ నేపథ్యంలో సివిల్స్‌తో సహా వివిధ పరీక్షల సవరించిన తేదీలను యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వెల్లడించింది. కొత్త తేదీలను కమిషన్‌ అధికారిక వెబ్‌సైట్‌ upsc.gov.in లో ఉంచింది. యూపీఎస్సీ సీసీఎస్సీ ప్రధాన పరీక్ష వచ్చే ఏడాది జనవరి 8న జరగనుంది. అదేవిధంగా సివిల్‌ సర్వీసెస్‌ (మెయిన్‌)-2019 పరీక్షకు సంబంధించిన ఫిజికల్‌ టెస్ట్‌లు జూన్‌ 20 నుంచి జరగనున్నాయి.  ప్రధానమైన పరీక్షలు  ఎన్‌డీఏ అండ్‌ ఎన్‌ఏ పరీక్ష (1)- సెప్టెంబర్‌ 6న కంబైండ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ ఎగ్జామ్‌- అక్టోబర్‌ 22న సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ ఎగ్జామినేషన్‌- డిసెంబర్‌ 20న ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ (మెయిన్‌) ఎగ్జామ్‌- 2021, ఫిబ్రవరి 28న ఐఈఎస్‌ లేదా ఐఎస్‌ఎస్‌ ఎగ్జామినేషన్‌- అక్టోబర్‌ 16న ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ మెయిన్‌ ఎగ్జామ్‌- ఆగస్టు 9న కంబైండ్‌ జీయో సైంటిస్ట్‌ (మెయిన్‌) ఎగ్జామ్‌- ఆగస్టు 8న జరగనున్నాయి. యూపీఎస్సీ...