Posts

Featured Post

ప్రధానమంత్రి ( విద్యాలక్ష్మీ ) ఎడ్యుకేషన్ లోన్.. ఇలా అప్లై చేయండి..

Image
ఆర్థిక పరిస్థితి సరిగా లేని విద్యార్థులకోసం కేంద్రప్రభుత్వం ప్రధానమంత్రి విద్యా లక్ష్మీ ఎడ్యుకేషన్ లోన్ స్కీమ్‌ని ప్రవేశపెట్టింది. ఈ లోన్‌ పొందాలంటే వివరాలు ఏంటో తెలుసుకోండి..  ప్రధానమంత్రి విద్యా లక్ష్మీ ఎడ్యుకేషన్ లోన్ స్కీమ్ ద్వారా పేద విద్యార్థులకు ఆర్థిక సాయం చేసేందుకు కేంద్రప్రభుత్వం చర్యలు చేపట్టింది.. ఆర్థికస్థోమత తక్కువగా ఉన్నవారు పైచదువులు చదివేందుకు ఈ లోన్ సదుపాయం చక్కగా ఉపయోగ పడుతుంది. ఇందులో 22 వేర్వేరు విద్యారుణాలున్నాయి. లోన్ పొందేందుకు అర్హతలు: ఇంటర్మీడియెట్ పూర్తి చేసి ఉండాలి. విద్యార్థుల తల్లీదండ్రులు ఆదాయ సర్టిఫికెట్స్ ఉండాలి. లోన్ ఎలా అప్లై చేయాలంటే.. ముందుగా..    Link : http://www.vidyalakshmi.co.in /   వెబ్‌సైట్‌లో మన పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. మన డీటెయిల్స్‌ని బట్టి ఎంతవరకూ లోన్ పొందొచ్చో తెలుసుకోవచ్చు. మన వివరాలు చూసి పరీక్షించిన బ్యాంక్స్ మనం లోన్‌ తీసుకునేందుకు అర్హులో.. కాదో తెలియజేస్తాయి. ఒకవేళ మనం అర్హులైతే నగదు నేరుగా మనం ఇచ్చిన అకౌంట్‌లో చేరుతుంది. ఒకవేళ మీ అప్లికేషన్ హోల్డ్‌లో ఉంటే.. మన నుంచి బ్యాంక్ అదనపు వివరాలు కోరుతుందని

ఇంటర్మీడియట్ ఫలితాలు... Websites

Image
#Results తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు... మొదటి సంవత్సరం... http://results.eenadu.net/ts-inter-2020/ts-inter-1st-year-results-2020-general.aspx https://eduresults.sakshi.com/ https://tsbie.cgg.gov.in/ http://bie.telangana.gov.in/ రెండో సంవత్సరం... http://results.eenadu.net/ts-inter-2020/ts-inter-2nd-year-results-2020-general.aspx http://www.sakshieducation.com/ https://tsbie.cgg.gov.in/ http://bie.telangana.gov.in/

తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదల

Image
తెలంగాణ ఇంటర్మీడియెట్‌ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలను నాంపల్లిలోని ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేశారు. గత మార్చి నెలలో జరిగిన ఈ పరీక్షలకు 9.65 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలను  4,80,555 మంది విద్యార్థులు హాజరుకాగా, 67.47 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఎప్పటిలాగానే ఫలితాల్లో బాలికలు ముందంజలో ఉన్నారు. బాలికలు 60శాతం, బాలురు 52.30 శాతం ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్‌ పరీక్షలను 4,11,631 మంది విద్యార్థులు రాయగా, 68.86శాతం ఉత్తీర్ణత సాధించారు. వారిలో బాలికలు 75.15 శాతం, బాలురు 62.10 శాతం పాసయ్యారు. ఇంటర్‌ ఫలితాల్లో 76 శాతం ఉత్తీర్ణతతో కొమురం భీం ఆసీఫాబాద్‌ జిల్లాకు అగ్రస్థానం దక్కగా.. 75 శాతంతో మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా ద్వితీయ స్థానంలో నిలిచింది. ఫలితాల విడుదల సందర్భంగా మంత్రి సబితా ఇంద్రా రెడ్డి మాట్లాడుతూ.. అన్ని జాగ్రత్తలు తీసుకుని పరీక్షలు నిర్వహించామన్నారు.విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వాల్యుయేషన్‌కు సహకరించిన లెక్చరర్

ఆధార్‌తో ఎస్‌బీఐ ఆన్‌లైన్‌ సేవింగ్స్‌ అకౌంట్‌

Image
 ఆధార్‌ నంబర్‌తో ఇన్‌స్టంట్‌గా డిజిటల్‌ సేవింగ్స్‌ అకౌంట్‌ను తెరిచే సౌలభ్యాన్ని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) పునః ప్రారంభించింది. ఇందుకోసం యోనో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అందులో పాన్‌, ఆధార్‌ వివరాలతో పాటు ఓటీపీని నమోదు చేయాల్సి ఉంటుంది. అనంతరం ఇతర వివరాలు ఇవ్వాలి. నామినేషన్‌ సదుపాయం కూడా ఉంది. ఆన్‌లైన్‌లో ఖాతా తెరిచిన వారికి రూపే ఏటీఎం, డెబిట్‌ కార్డును జారీ చేస్తారు. కాగితం అవసరం లేకుండానే ఇన్‌స్టా సేవింగ్స్‌ బ్యాంక్‌ ఖాతాను  పాన్‌, ఆధార్‌ వివరాలతో తెరవొచ్చని ఎస్‌బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. ఇదంతా బ్యాంక్‌ శాఖను సందర్శించకుండానే సాధ్యమౌతుందని ఎస్‌బీఐ ఛైర్మన్‌ రజనీశ్‌ కుమార్‌ పేర్కొన్నారు. పూర్తి కేవైసీ అప్‌డేట్‌ చేసేందుకు ఏడాదిలో ఎప్పుడైనా సమీప బ్రాంచ్‌ను సంప్రదించొచ్చని ఎస్‌బీఐ తెలిపింది.

నేటి ముఖ్యాంశాలు.. 13 Jun, 2020

జాతీయం  ఈ నెల 16,17 తేదీల్లో సీఎంలతోప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌   16న కేంద్రపాలిత ప్రాంతాలు, 12 రాష్ట్రాల సీఎంలతో మాట్లాడనున్న ప్రధాని  17న ఏపీ, తెలంగాణ సహా 15 రాష్ట్రాల సీఎంలతో మాట్లాడనున్న ప్రధాని  లాక్‌డౌన్‌ పరిణామాలు, ప్రస్తుతం దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతర అంశాలపై చర్చించనున్న ప్రధాని మోదీ దేశంలో మొత్తం 2,97,535 కరోనా పాజిటివ్‌ కేసులు  ఇప్పటివరకు 1,47,195 మంది డిశ్చార్జ్‌, 8,498 మంది మృతి  దేశంలో ప్రస్తుతం 1,41,842 యాక్టివ్‌ కేసులు  దేశంలో49 శాతానికి చేరిన కరోనా రికవరీ రేటు  దేశంలో ఇప్పటి వరకు 53,63,445 మందికి కరోనా పరీక్షలు ఎన్నికలకు ముందు ట్రంప్‌ మరో దుందుడుకు ఆలోచన  కొత్తగా ఇచ్చే H1B వీసాలను సస్పెండ్‌ చేసే యోచన  H1Bతో పాటు H2B, J1, L1 వీసాలు కూడా సస్పెండ్‌ చేసే యోచన తెలంగాణ  జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి కరోనా పాజిటవ్‌  రెండుసార్లు పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ ఏపీ  గత 24 గంటల్లో 11,775 మందికి పరీక్షలు, 141 పాజిటివ్‌  ఇప్పటివరకు కరోనాతో కోలుకొని 2,599 మంది డిశ్చార్జ్‌  ఏపీలో ప్రస్తుతం 1723

దోస్త్‌-2020 షెడ్యూల్ రెడీ..!

తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఈ నెల 15 లేదా 16వ తేదీన షెడ్యూల్‌ విడుదల కానున్నది. ఈ మేరకు డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌-2020) అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇంటర్మీడియట్‌ సెకండియర్‌ ఫలితాలు ఈ నెల 15న విడుదల కానున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా షెడ్యూల్‌ రూపొందించే పనిలో పడ్డారు అధికారులు. 2020-21 విద్యాసంవత్సరానికి జూలై, ఆగస్టులో దశవారీగా అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్ారు. డిగ్రీ ఆడ్మిషన్లను చేపట్టి ఆగస్టు 24 వరకు పూర్తిచేయనున్నారు యూజీసీ మార్గదర్శకాలను అనుసరించి మొదటి సంవత్సరం తరగతులను సెప్టెంబర్‌ ఒకటి నుంచి, ద్వితీయ, తృతీయ సంవత్సరం తరగతులను ఆగస్టు ఒకటినుంచి ప్రారంభించాల్సి ఉంది. ఈ మేరకు షెడ్యూల్‌ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. కరోనా నిబంధనలు పాటిస్తూనే డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియ చేపట్టనున్నారు. ఆన్‌లైన్‌ ద్వారా అడ్మిషన్ల నిర్వహణకు సీజీజీ సహకారం అందిస్తున్నది. విద్యార్థులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించడం కోసం వాట్సాప్‌, ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ వంటి సోషల్ మీడియాను ఉపయోగించనున్నారు. ఇక కాలేజీలను ఎప్పుడు తెరుస్తారన

నేటి ముఖ్యాంశాలు.. 13 Jun, 2020

రాగల 24 గంటల్లో తెలంగాణలో భారీ వర్ష సూచన ఢిల్లీలోని ప్రభుత్వ ఆస్పత్రులు సరైన రీతిలో స్పందించడం లేదని సుప్రీం కోర్టు సీరియస్ సరిహద్దుల దగ్గర చైనాతో చర్చించిన భారత్ మాతో ఎందుకు చర్చించదు అని నేపాల్ విదేశాంగమంత్రి ప్రశ్న ఆన్ లైన్ క్లాసుల వల్ల చూపు మందగించడం, కళ్ళు మంటలు, లాంటి సైడ్ ఎఫెక్ట్స్ తో పిల్లలు ఇబ్బంది పడుతున్నారని కొంతమంది తల్లిదండ్రుల ఫిర్యాదులు తెలంగాణలోని డిగ్రీ కళాశాలల ప్రవేశాల కోసం (దోస్త్-2020)ఈనెల 15 లేదా 16న షెడ్యూల్ విడుదల ప్రముఖ మొబైల్ సంస్థ నోకియా ఒకసారి ఛార్జింగ్ పెడితే 30 రోజులు బ్యాటరీ వస్తుందని ఈ మొబైల్ త్వరలో మార్కెట్కు రానుందని సంస్థ ప్రతినిధుల వెల్లడి  లాక్ డౌన్ కారణంగా కుదేలు అయిపోయిన చిరు వ్యాపారులకు మే జూన్ జూలై నెలలకు  జి ఎస్ టి ఆర్- 3 బి ఫామ్ లను సెప్టెంబర్ లోగా ఫైన్ లేకుండా  దాఖలు చేసే వెసులుబాటు ను కల్పించిన కేంద్రం నల్లగొండ పద్మావతి కాలనీ లో ఇండ్లలో పని చేసుకుని జీవనం సాగించే మాధవి అనే మహిళ ఇంటికి ఏకంగా 19 లక్షల కరెంట్ బిల్లు సూర్యాపేట జిల్లా నడిగూడెం లో లాటరీ పేరుతో  బురిడీ కొట్టించి రెండు లక్షలు దండుకున్న కేటుగాడు